twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోసాని ఆరోగ్యంపై రూమర్లు.. మరోసారి ఆస్పత్రిలో చేరిన సీనియర్ యాక్టర్

    |

    Recommended Video

    Posani Krishna Murali Hospitalized || Filmibeat Telugu

    తనదైన నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న వారిలో పోసాని కృష్ణ మురళి ఒకరు. రచయితగా తెలుగు చిత్ర సీమలోకి అడుగు పెట్టిన పోసాని.. ఆ తర్వాత డైరెక్టర్‌గా, నటుడిగా మారారు. ఎన్నో సినిమాల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. 'ఐ లవ్ యూ రాజా' అంటూ ఆయన వాడే ఊత పదానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో.

    ఆస్పత్రిలో చేరిక

    ఆస్పత్రిలో చేరిక

    కొంత కాలంగా కీళ్ల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పోసాని కృష్ణ మురళి.. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఆయనకు పరీక్షలు చేసిన అనంతరం సర్జరీ చేయాలని చెప్పారు వైద్యులు. అనంతరం ఆపరేషన్ కూడా చేశారు. ఆ తర్వాత చాలా రోజుల పాటు ఆయన ఆస్పత్రిలోనే ఉండి, కొద్దిరోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యారు.

    పరామర్శించిన వైసీపీ నేతలు

    పరామర్శించిన వైసీపీ నేతలు

    ఆపరేషన్ చేయించుకున్న అనంతరం పోసానిని ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీకి చెందిన నేతలు పరామర్శించారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ముఖ్య నేతలు ఆయనను కలిశారు. వారితో పాటు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రముఖ కమెడియన్ పృథ్వీ సైతం పోసానిని పరామర్శించారు.

    తిరగబెట్టడంతో మళ్లీ ఆస్పత్రిలో చేరిక

    తిరగబెట్టడంతో మళ్లీ ఆస్పత్రిలో చేరిక

    ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ పోసాని సమస్య నయం కాలేదని తెలుస్తోంది. ఆయన సర్జరీ తర్వాత బయటకు రాకపోవడంతో చాలా మందికి అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ వార్త బయటకు వచ్చింది. సమస్య నయం కాకపోవడంతో పోసాని మరోసారి ఆస్పత్రిలో జాయిన్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్త బయటకొచ్చిన తర్వాత ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

    పొలిటికల్ ఎంట్రీ

    పొలిటికల్ ఎంట్రీ

    సినిమా రంగంలో విలక్షణ నటుడిగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న పోసాని కృష్ణ మురళి.. 2009లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అదే సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా..

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా..

    ప్రజారాజ్యం పార్టీ కంటే ముందే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగిన పోసాని.. రీఎంట్రీలో మాత్రం ఆయనకు వ్యతిరేకంగా పని చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అధినేతపై సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, వైఎస్ జగన్‌ను గెలిపిస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని ప్రచారం కూడా నిర్వహించారు.

    English summary
    Telugu Sensational Actor Posani Krishna Murali Suffering About His Knee pains. HE Joined In Yasoda Hospital In Hyderabad. Doctors Do Oparation To Him. He supports YSR Congress Party In Last Elections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X