twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిజమే, చెప్పుతో కొడతారు: పోసాని కామెంట్లకు ఇండస్ట్రీ మద్దతు!

    ఎన్టీఆర్ బయోపిక్ మీద పోసాని కృష్ణ మురళి స్పందించారు. ఆ మహానుభావుడు మచ్చలేని మనిషి అని వ్యాఖ్యానించారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి త్వరలో వర్మ తీయబోతున్న ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో తనదైన రీతిలో స్పందించారు. ఎన్టీఆర్ గురించి తాను తప్పుగా మాట్లాడితే తనను చెప్పుతో కొడతారని, అసలు ఆయన గురించి తప్పుగా మాట్లాడే అంశాలు ఆయన జీవితంలో లేవని, ఈ విషయమై తాను ఎవ్వరితోనైనా మాట్లాడగలనని పోసాని అన్నారు.

    పోసాని చేసిన ఈ కాంమెంట్లపై ఇండస్ట్రీ నుండి పూర్తి మద్దతలు లభిస్తోంది. పోసాని చెప్పిన దాంట్లో వందశాతం నిజం ఉందని, ఎన్టీఆర్ ఒక మహానటుడు, తెలుగు జాతి కీర్తి పెంచిన మహనీయుడు, ఆయన గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా, తప్పుగా చూపించినా సహింబోము అంటూ.... పలువురు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు తమ మద్దతు ప్రకటిస్తున్నారు.

    పోసాని చెప్పింది నిజమే, నెగెటివ్ టచ్ చేయొద్దు

    పోసాని చెప్పింది నిజమే, నెగెటివ్ టచ్ చేయొద్దు

    పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ, ‘పుట్టిన ప్రతివ్యక్తి చనిపోయే వరకూ ఎన్నో గొప్ప పనులు చేసి ఉండొచ్చు కానీ, అదే సమయంలో తనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు కూడా జరుగుతాయి. నెహ్రూ, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి, మోదీ ఇలా ప్రతి ఒక్కరి జీవితంలోనూ తెలియకుండా పొరపాట్లు జరుగుతాయి. అలాంటి నెగెటివ్ అంశాలు టచ్ చేయకూడదు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

    వాటికి ఆధారం ఉంటే చెప్పండి

    వాటికి ఆధారం ఉంటే చెప్పండి

    రామారావుగారు పదవిని అడ్డుపెట్టుకుని కొడుకులకు దోచిపెట్టారు, భూ కబ్జా చేశారు, క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, కుటుంబాన్ని ప్రేమించలేదు, సినిమారంగంలో మోసం చేశారు.. వంటి అంశాలు ఏమైనా ఉంటే, వాటికి ఆధారం ఉంటే కనుక చూపాలి. ఈ విషయంలో రామారావు గారు మచ్చలేని వ్యక్తి అని పోసాని అన్నారు. ఈ విషయంలో పోసానికి ఫుల్ సపోర్టు లభిస్తోంది.

    ప్రతి అంశం నిజాయతీతో కూడుకున్నదే

    ప్రతి అంశం నిజాయతీతో కూడుకున్నదే

    రామారావు గారు బసవతారకం గారు చనిపోయే వరకు ఆమెను దేవతలా ప్రేమించారు. ఆమె కేన్సర్ వ్యాధితో మరణిస్తే చిన్నపిల్లాడిలా విలపించారు. ఆయన జీవితంలో ప్రతి అంశం నిజాయతీతో కూడుకున్నదే అని పోసాని అన్నారు. పోసాని చెప్పింది నిజమే అని ఇండస్ట్రీ వ్యక్తుల మాట.

    అవినీతి లేదు, అన్యాయం చేయలేదు

    అవినీతి లేదు, అన్యాయం చేయలేదు

    ప్రజల కోసం వచ్చిన ఎన్టీఆర్ జీవితంలో అవినీతి లేదు. ఆయన సినీ జీవితంలో, వ్యక్తిగత జీవితంలోనూ ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. చివరకు, లక్ష్మీపార్వతిగారిని కూడా రామారావుగారు మోసం చేయలేదు. నిజాయతీగా నిలబడి ఆమెతో చివరిదాకా ఉన్నారు అంటూ పోసాని చేసిన కామెంట్లను ప్రతి ఒక్కరూ సమర్ధిస్తున్నారు.

    తెలుగు ప్రపంచం బాధపడేలా చేయొద్దు

    తెలుగు ప్రపంచం బాధపడేలా చేయొద్దు

    వివాదాలు వివాదాలు అంటున్నారు..... అసలు తీయడానికి రామారావుగారి జీవితంలో నెగెటివ్ ఏముంది? ఏమీ లేదు. ఇదే వాస్తవం. నేనే ఆయన్ను కాకపడుతున్నాను అని మీరు అనుకోవడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే ఇపుడు లేరు కాబట్టి..... అంటూ తనదైన వెర్షన్ వినిపించారు పోసాని.

    తెలుగు ప్రపంచం బాధపడేలా చేయొద్దు

    తెలుగు ప్రపంచం బాధపడేలా చేయొద్దు

    ఇప్పటి వరకు తీసిన జీవిత చరిత్రలన్నీ వివాదాస్పదం అయ్యాయి. ఎన్టీఆర్ గురించి సినిమా తీస్తే అలా కావొద్దని కోరుకుంటున్నాను. ఆయన సినిమా చూసి ఎవరనా ఏ కొంచెం బాధపడ్డా, అది తెలుగు ప్రపంచం మొత్తం బాధపడేలా చేస్తుంది. ఇలాంటి జరుగొద్దు అని నేను కోరుకుంటున్నట్లు పోసాని తెలిపారు. పోసాని వ్యాఖ్యలకు సినీ పరిశ్రమ నుండి పూర్తి మద్దతు లభిస్తోంది.

    ఎన్టీఆర్ మీద చెప్పులేశారు, బాలయ్య కూడా కుట్రదారుడే: వర్మ బయోపిక్‌పై లక్ష్మీ పార్వతి

    ఎన్టీఆర్ మీద చెప్పులేశారు, బాలయ్య కూడా కుట్రదారుడే: వర్మ బయోపిక్‌పై లక్ష్మీ పార్వతి

    ఎన్టీఆర్ మీద చెప్పులేశారు, బాలయ్య కూడా కుట్రదారుడే. ఆయన్ను పెట్టి వర్మ సినిమా తీస్తే న్యాయం జరుగదు అంటూ లక్ష్మీ పార్వతి సంచలన కామెంట్ చేశారు.

    <strong>పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి. </strong>పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    శత్రువులు, నమ్మక ద్రోహులెవరో? చూపిస్తా.... ఎన్టీఆర్ బయోపిక్‌పై ఆర్జీవీ

    శత్రువులు, నమ్మక ద్రోహులెవరో? చూపిస్తా.... ఎన్టీఆర్ బయోపిక్‌పై ఆర్జీవీ

    ఎన్టీఆర్ బయోపిక్‌పై ఆర్జీవీ అధికారిక ప్రకటన చేశారు. ఆయన జీవితాన్ని తెరపై చూపించబోతున్నట్లు. ఇందులో వివాదాస్పద అంశాలు, వివాదాస్పద వ్యక్తులు కూడా ఉంటాయని, ఆయన శత్రువులు, నమ్మక ద్రోహులెవరో? చూపిస్తా అంటూ వర్మ ప్రకటించారు.

    <strong>పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి. </strong>పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    English summary
    Posani Krishna Murali Responds on ntr biopic. Filmmaker Ram Gopal Varma on Tuesday said he is proud to be given the opportunity to direct a biopic on legendary Telugu actor and former Chief Minister of Andhra Pradesh, Nandamuri Taraka Rama Rao (NTR).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X