సెక్సీ నమితతో పోసాని కృష్ణమురళి రొమాన్స్
భారీ అందాల నమిత తాజాగా పోసాని కృష్ణమురళి ప్రక్కన నటించటానికి కమిటయ్యింది. మిస్.చింతామణి ఎమ్ ఎ(కేరాఫ్ సుబ్బిగాడు) అనే టైటిల్ తో రూపొందనున్న చిత్రంలో పోసాని లీడ్ రోల్ చేయనున్నారు.ఈ చిత్రంలో చింతామణిగా నమిత కనిపించి కనువిందు చేయనుంది. క్షేమంగా వెళ్లి లాభంగా రండి వంటి కామిడీ చిత్రాలతో పాపులర్ అయిన దర్శకుడు రాజా వన్నెం రెడ్డి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. ఎఎ ఆర్ట్స్ వారు ఈ చిత్రం రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు బుధవారం ఎ.ఎ.ఆర్ట్స్ ఆఫీసులో జరిగాయి. ఇక నమిత,పోసాని కాంబినేష్ క్రేజ్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం పోసాని దర్సకత్వంలో రూపొందిన జెంటిల్ మెన్ చిత్రం రిలీజుకు రెడీ అవుతోంది. ఇందులో ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.
నమిత దేశద్రోహి జగన్మోహిని పోసాని కృష్ణ మురళి ఆర్తి అగర్వాల్ జెంటిల్ మెన్ namitha desadrohi jagan mohini posani krishna murali aarthi agarwal gentle man


Click it and Unblock the Notifications