పోసాని కృష్ణమురళి '420'
మెంటల్ కృష్ణ,రాజావారి చేపలు చెరవు వంటి చిత్రాలలో ప్రధానపాత్ర పోషించిన పోసాని కృష్ణ మురళి మరో ఢిఫెరెంట్ పాత్రలో కనిపించి అలరించనున్నారు. పోసాని కృష్ణమురళి, ఆర్తి అగర్వాల్ కాంబినేషన్ లో '420'..'ట్రైన్‌డ్ ఇన్ జైల్' అనేది ట్యాగ్ లైన్ తో ఓ చిత్రం రాబోతోంది. ఈ చిత్రం ద్వారా జె.మోహన్‌కాంత్ దర్సకుడు పరిచయం కానున్నారు. టి.శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు మాట్లాడుతూ ''సమకాలీన పరిస్థితులకు అద్దంపట్టే చిత్రమిది. సమాజంలోని పోకడలు, పోలీసుల పనితీరుని చూపించే ప్రయత్నమిది. పోసాని పోషించిన పాత్ర కనువిప్పు కలిగించేలా ఉంటుంద''న్నారు. ఛత్రపతి శేఖర్, పి.డి.రాజ్, జగన్, జి.శ్రీనివాస్ ఇతర పాత్రధారులు. కెమెరా: రాకేష్ గౌడ్, సంగీతం: సుభాష్, పృథ్వీ.


Click it and Unblock the Notifications











