twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చాలా మంది తాట తీశాడు: బాలకృష్ణపై పోసాని సంచలన కామెంట్స్

    |

    Recommended Video

    Posani Krishna Murali Satirical Comments On Balakrishna | Filmibeat Telugu

    టాలీవుడ్ స్టార్ నందమూరి బాలకృష్ణపై సినీ నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలయ్య చాలా పవర్ ఫుల్ అని, ఇప్పటి వరకు ఆయన చాలా మంది తాట తీశాడంటూ తనదైన శైలిలో వ్యంగాస్త్రాలు సంధించారు.

    తెలంగాణలో కేసీఆర్ గెలుపు నేపథ్యంలో అభినందనలు తెలుపుతూ మీడియాతో మాట్లాడిన పోసానికి... ఈ సందర్భంగా పాత్రికేయుల నుంచి బాలయ్య చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావన ఎదురైంది. దీంతో పోసాని స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్య పరిచింది.

    బాలయ్య చాలా తాటలు తీశాడు

    బాలయ్య చాలా తాటలు తీశాడు

    కేసీఆర్ ఏపీలో అడుగు పెడితే తాట తాస్తా అని బాలయ్య ఇటీవల కూకట్‌పల్లి మీటింగులో అన్నారు అంటూ కొందరు పాత్రికేయులు ప్రస్తావించగా.... ‘ఆయన ఆ మాట అన్నాడా?' ఆయన గురించి మీకు తెలుసుగా చాలా తాటలు తీశారు' అంటూ పోసాని వ్యాఖ్యానించారు.

    ఆయన ఎంతో పవర్ ఫుల్

    ఆయన ఎంతో పవర్ ఫుల్

    వాళ్ల నాన్న రామారావును వెన్నుపోటు పొడిస్తే చంద్రబాబుగారి తాట తీశాడు, వాళ్ల నాన్న మీద చెప్పేస్తే ఎవడ్రా అని వాళ్లను ఇరగొట్టాడు. మీకు తెలుసుకదా బాలకృష్ణ ఎంత పవర్ ఫుల్ పర్సనో... అంటూ పోసాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

    ఆయన మాట అంటే వెనక్కి తీసుకోరు

    ఆయన మాట అంటే వెనక్కి తీసుకోరు

    ఆయన మాట అంటే వెనక్కి తీసుకోడు. అందుకనే రామారావును ఎవరైతే వెన్నుపోటు పొడిచారో వారిని కింద పడేసి కసా కసా కాళ్లతో తొక్కి బయటకు వెళ్లగొట్టేశారు. అలాంటి బాలకృష్ణ గురించి నేనేం చెప్పగలను.... అంటూ పోసాని వ్యాఖ్యానించారు.

    కేసీఆర్‌కే ఓటేశాను

    కేసీఆర్‌కే ఓటేశాను

    ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాను కేసీఆర్‌కే ఓటేశాను, ఆయన గెలవాలని కోరుకున్నాను. అలా జరిగినందుకు చాలా సంతోషంగా ఉందని పోసాని అన్నారు. కేసీఆర్ పాలన బావుంది కాబట్టే ప్రజలు ఆయనకు పట్టం కట్టారని తెలిపారు.

    English summary
    Posani Krishna Murali Satirical Comments On Balakrishna. Posani Krishna Murali is an Indian screenwriter, actor, director and producer who primarily works in Telugu cinema. He worked as a writer for over 150 Telugu films and directed a number of films. In 2009, he also contested in Andhra Pradesh state legislative assembly elections from Chilakaluripet constituency but lost the elections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X