twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న పోసాని వ్యాఖ్యలు

    |

    Recommended Video

    Posani Krishna Murali Sensational Comments On Telugu Film Industry || Filmibeat Telugu

    రచయితగా, దర్శకుడిగా, నటుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పోసాని కృష్ణమురళి. పొలిటికల్ అంశాలపై ఎక్కువగా స్పందించే ఆయన తాజాగా తెలుగు దేశం పార్టీపై, తెలుగు సినిమా దర్శకనిర్మాతలపై చేసిన కొన్ని కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేశారు పోసాని. వివరాల్లోకిపోతే..

    వైసీపీ విన్.. పోసాని ఖుషీ ఖుషీ

    వైసీపీ విన్.. పోసాని ఖుషీ ఖుషీ

    మొదటి నుంచి వైసీపీ అధినేత జగన్‌కి పోసాని కృష్ణమురళి పెద్ద ఫ్యాన్. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం కూడా చేశాడు పోసాని. అయితే ఆయన భావించినట్లుగానే వైసీపీ విక్టరీ సాధించడంతో ఖుషీ ఖుషీగా ఉన్నారు పోసాని కృష్ణ మురళి. ఈ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీపై ఆయన చేసిన కొన్ని కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

    ఇక సినిమా చేద్దామని అనుకుంటే..

    ఇక సినిమా చేద్దామని అనుకుంటే..

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇన్నాళ్లు రాజకీయ కార్యకలాపాలతో కాస్త బిజీ అయిన పోసాని తిరిగి సినిమాల్లో నటించేందుకు రెడీ అయ్యారు. అయితే వైసీపీకి అణకువగా ఉండటం కారణంగా ఇదివరకులా తనకు సినిమా అవకాశాలు రావడం లేదని అంటున్నాడు పోసాని. ఈ మేరకు తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కువ‌గా తెలుగుదేశం వాళ్లే ఉన్నార‌ని, వాళ్ళే త‌న‌కు ఆఫ‌ర్లు రాకుండా చేస్తున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు పోసాని.

    కావాలనే పక్కన బెట్టారు

    కావాలనే పక్కన బెట్టారు

    ఈ మధ్యనే తనకు ఓ పెద్ద సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ.. కొందరు కావాలనే ఆ దర్శకనిర్మాతలు తప్పుదోవ పట్టించి తనను పక్కకు పెట్టించారని అంటున్నారు పోసాని. ఈ నేపథ్యంలో ఆయన ఓ బడా నిర్మాత పేరు కూడా ప్రస్తావించడం తెలుగు సినిమా పరిశ్రమలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

    సినిమా ఇండస్ట్రీ తరలింపుపై

    సినిమా ఇండస్ట్రీ తరలింపుపై

    ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా స్టూడియోలు ఏపీలో నిర్మించడానికి సుముఖంగా ఉన్నామంటూ కొందరు దర్శకనిర్మాతలు చెబుతుండటం చూస్తున్నాం. అయితే తెలుగు ఇండ‌స్ట్రీని ఏపీకి తరలించే ప్రయత్నం మంచి కాదని తన అభిప్రాయం వెలిబుచ్చారు పోసాని. సినీ పరిశ్రమకు వ‌చ్చే ఆదాయంలో 45 శాతం షేర్ తెలంగాణ నుంచే వస్తుందనే విషయాన్ని మరవొద్దని ఆయన అన్నారు. కాగా పోసాని చేసిన ఈ కామెంట్స్ పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

    English summary
    In 2019 Ap Elections Telugu Desham Party loosed their ruling. Ysr cp got presigious win. Posani Krishna Murali supported Ycp. Then Posani says.. he is facing some problems with tollywood producres
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X