నా భార్యకు వందమంది అక్రమ సంబంధం ఉన్నా.. నాతోనే.. పవన్ కల్యాణ్ సిగ్గుచేటు.. పోసాని ఆగ్రహం

పవన్ కల్యాణ్, పోసాని కృష్ణమురళీ మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలపై పోసాని అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో పవర్ స్టార్ అభిమానులు పలురకాల మెసేజ్‌లు, ఫోన్లు చేస్తూ పోసానిని విసిగించిన నేపథ్యంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోసాని మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ..

అప్పుడు కేసీఆర్‌ను ప్రశ్నించలేదేంటి?

అప్పుడు కేసీఆర్‌ను ప్రశ్నించలేదేంటి?

పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తూ.. తునకలు తునకలు చేస్తానని అన్నాడు. అప్పుడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఏం చేశారు. ఇప్పుడు నా అభిప్రాయం చెబితే నాపై మాటల దాడి చేస్తారా? కేసీఆర్‌ను ఎందుకు ప్రశ్నించలేదు. నా భార్యను ఎందుకు అన్యాయంగా నీ ఫ్యాన్స్ తిడుతుంటే నేను ఊరుకోవాలా? అంటూ పోసాని కృష్ణ మురళీ ఘాటుగా స్పందించారు.

నేను జగన్ అభిమానిని అంటూ..

నేను జగన్ అభిమానిని అంటూ..

నేను జగన్‌కు అభిమానిని. ఆయన పార్టీ పెట్టకముందు నుంచి ఆయనకు సహాయం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయంగా చేసిన తప్పులను వీడియోలతో సహా చూపించాను. దాంతో నాపై ఫ్యాన్స్‌తో దాడి చేయించడం సరికాదు. నా భార్య పనివాడితో అక్రమ సంబంధం పెట్టుకొన్నారు? నీ బిడ్డలు కూడా వాడికే పుట్టారు అని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ నాకు ప్రశ్నలు వేయిస్తున్నారు అని పోసాని అన్నారు.

అప్పుడు పవన్ కల్యాణ్ ఎక్కడున్నాడు?

అప్పుడు పవన్ కల్యాణ్ ఎక్కడున్నాడు?

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. ప్రజారాజ్యం పార్టీ సమయంలో చిరంజీవిని కేశినేని నాని తిడితే.. వ్యాన్‌లో కూర్చోని ఏడ్చాడు. ఆ సమయంలో కన్నబాబు తన సోదరుడు కల్యాణ్ కృష్ణను పంపించి.. చిరంజీవి మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు. కానీ మీ ఫోన్ ఆఫ్‌లో ఉంది అంటే.. నేను ఫోన్ ఆన్ చేశాను అని పోసాని చెప్పారు.

ఆ సమయంలో నేను వెళ్లి ప్రజారాజ్యం ఆఫీస్‌కు వెళ్లి కేశినేనితో మాట్లాడి సర్ది చెప్పాను. మీకు చిరంజీవికి ఎలాంటి వైరం ఉంది. ఎందుకు అలా తిడుతున్నావు అని అడిగాను. దాంతో అప్పటి నుంచి కేశినేని తన ప్రవర్తను మార్చుకొన్నారు. అప్పుడు పోసాని నా గుండెల్లో ఉంటాడు అని చిరంజీవి అన్నారని పోసాని ఆనాటి విషయాలను గుర్తు చేసుకొన్నారు. అప్పుడు చిరంజీవికి అలాంటి అవమానం ఎదురైతే పవన్ కల్యాణ్ ఎక్కడ.. ఆయన ఫ్యాన్స్ దాక్కొన్నారు అని పోసాని ప్రశ్నించాడు.

అప్పుడు కేశినేని నన్ను టార్గెట్ చేస్తే..

అప్పుడు కేశినేని నన్ను టార్గెట్ చేస్తే..

కేశినేని నానిని నేను తిట్టినందుకు నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆ సమయంలో ఇద్దరు గన్‌మెన్లు పెట్టుకొని షూటింగుకు వెళ్లాను. అప్పుడు నాకు ఏదైనా అపకారం జరిగితే నా భార్యబిడ్డల పరిస్థితి ఏమిటి? అని పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు పవన్ కల్యాణ్ ఎక్కడున్నారు. ఇప్పుడు నేను పవన్ కల్యాణ్‌ను జగన్ కార్యకర్తగా ప్రశ్నిస్తే.. నాపై నీ సైకో ఫ్యాన్స్‌తో దాడి చేయిస్తావా? అని పోసాని ప్రశ్నించాడు.

నా భార్యకు, పనివాడితో అక్రమ సంబంధం అంటూ

నా భార్యకు, పనివాడితో అక్రమ సంబంధం అంటూ

పోసాని కృష్ణ మురళీ భార్య పనివాడితో అక్రమ సంబంధం పెట్టుకొన్నది. ఆ పనివాడిని తన్ని తరిమేశావు కదా.. ఆ విషయం నిజం కాదా? దానిపై క్లారిటీ ఇవ్వండి అంటూ నాకు ఫోన్లు చేసి మనోధైర్యం దెబ్బతీయాలని ఫ్యాన్స్ ట్రై చేస్తున్నారు. విష్ణు మంచు నామినేషన్ వేయడానికి వెళితే.. అక్కడ కూడా పవన్ కల్యాణ్ స్పెషల్ ఫ్యాన్స్ అడ్డుకొన్నారని తెలిసింది. అయినా మేము మనోధైర్యాన్ని కోల్పోం అని పోసాని అన్నారు.

Recommended Video

Heroine Shwetta Parashar About 'Alanti Sitralu' Movie
పవన్ కల్యాణ్‌కు సిగ్గుచేటు

పవన్ కల్యాణ్‌కు సిగ్గుచేటు

నా భార్య గురించి నాకు బాగా తెలుసు. ఆమె నాకు భార్య కాదు.. స్నేహితురాలు. నా భార్య వందమందితో అక్రమంగా సంబంధం పెట్టుకొన్నా నేను బాధపడను. ఆమె నాతోనే ఉంటుంది. ఓ రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తి ఓ ఆడపిల్ల గురించి.. ఓ వ్యక్తి భార్య గురించి ఇలా మాట్లాడుతారా? పవన్ కల్యాణ్‌కు ఇది సిగ్గుచేటు అని పోసాని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X