నా భార్య వ్యభిచారా?.. నేను సానికొంప పెట్టానా? పవన్ కల్యాణ్ పిరికి పంద.. పోసాని సంచలన ఆరోపణలు

పవన్ కల్యాణ్‌పై ఆరోపణలు చేసిన నేపథ్యంలో పవర్ స్టార్ అభిమానులు వేధింపులకు పాల్పడుతున్నారంటూ పోసాని కృష్ణ మురళీ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో పెట్టిన సమావేశంలో పదునైన మాటలతో దాడి చేశారు. తన వ్యక్తిగత జీవితాన్ని కెలికిన పవన్ కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పర్సనల్ విషయాలపై విమర్శలు గుప్పించారు. పోసాని కృష్ణ మురళీ మాట్లాడుతూ..

మీ కుటుంబానికి అండగా ఉన్నా..

మీ కుటుంబానికి అండగా ఉన్నా..

పవన్ కల్యాణ్ రాజకీయాలను అడ్డుపెట్టుకొని వ్యక్తిగత జీవితాల్లోకి ఎందుకు వస్తున్నావు. మీ కుటుంబం విషయంలో నేను ఒక అన్నలాగ ఉండి నేను సహాయం చేశాను. వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి లాగ కూడదని చెప్పాను కదా.. వ్యక్తిగత జీవితాన్ని ఇలా ఎందుకు చీప్‌గా మారుస్తున్నావు. మా కుటుంబాన్ని ఎందుకు రోడ్డు మీదకు లాగుతున్నావు. అదే నీ ఇంట్లో ఆడపిల్లకు జరిగితే బాధపడవా? ఈ రోజు నుంచి పవన్ కల్యాణ్‌కు ఒక్కటే చెబుతున్నా. ఇక నుంచి ఏదైనా టార్గెట్ చేస్తే.. నన్న వ్యక్తిగతంగా దూషించు. కానీ నా ఇంట్లో వాళ్లను బయటకు లాగకు అని పోసాని కృష్ణ మురళీ అన్నారు.

నీ ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేయకపోతే

నీ ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేయకపోతే

నా కుటుంబ సభ్యులను రోడ్డు మీదకు లాగకుండా నీ ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేసుకోవాలి. ఇక ముందు ఇలానే ఫోన్లు, మెసేజ్‌లు వస్తే.. నీ భార్యను, అమ్మను ఇలాగే తిడుతాను. అలాగే తిడుతాను. నీ ఇంట్లో ఆడపిల్లలు ఎంత గొప్పవాళ్లో.. నా భార్యకూడా అంతే గొప్ప. మీ ఇంట్లో ఆడవాళ్లకు శీలం ఎలా ఉంటుందో.. మా ఇంట్లో వాళ్లకు అలాగే శీలం ఉంటుందని తెలియదా? నీ భార్య, నీ అమ్మ, కూతుళ్లు పవిత్రంగా ఉండాలా? నా భార్య వ్యభిచారా? అంటూ పవన్ కల్యాణ్‌ను పోసాని ప్రశ్నించాడు.

నేను సాని కొంపలు పెట్టానా?

నేను సాని కొంపలు పెట్టానా?

నేను వ్యక్తిగత జీవితాలను లాగడం లేదు. నేను ఏమైనా సాని కొంపలు పెట్టానా? ఇంతకంటే దారుణమైంది ఏదైనా ఉంటుందా? ఓ రాజకీయ నాయకుడి వికృత రూపం చూపిస్తున్నా. ఒక అబద్దం వల్ల సమాజం పాడు అవుతుంది. నీకు ఎంత మంది పెళ్లాలు అని నేను అడిగానా? పంజాబీ అమ్మాయికి కడుపు చేయలేదా? పవన్ కల్యాణ్‌కు బుద్ధి లేదా? అని పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నీవు రాజకీయ నాయకుడివా?

నీవు రాజకీయ నాయకుడివా?

అమ్మాయిలను మోసం చేయడం లేదా? నీవు రాజకీయ నాయకుడివా? థూ.. నిన్ను విమర్శిస్తే మా ఇంట్లో వాళ్లపై పడుతావా? రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్‌ను దూషిస్తే.. ఆయన కూడా నవ్వుతూ వెళ్లిపోయారు. నీకు హుందాతనం ఉందా? హుందాతనానికి స్పెల్లింగ్ కూడా తెలియదు. ఎప్పుడైతే నా ఇంటి తలుపు తట్టావో అప్పుడే నీతో తేల్చుకొనేందుకు సిద్ధమయ్యాను. నేను చచ్చిపోయానా.. నా శవం కూడా తిడుతుంది అని పోసాని అన్నారు.

Recommended Video

Heroine Shwetta Parashar About 'Alanti Sitralu' Movie
నీవు తిట్టిస్తే.. నేను తిడుతూనే ఉంటా?

నీవు తిట్టిస్తే.. నేను తిడుతూనే ఉంటా?

నీవు ఎన్నిసార్లు తిట్టించినా అన్నీ సార్లు నేను తిడుతూనే ఉంటా. నీవు తప్పు చేస్తే ప్రశ్నిస్తూనే ఉంటా. మాకు సేవ చేస్తానని వచ్చావు. ప్రజా జీవితంలో ఉంటే ప్రశ్నిస్తునే ఉంటాను. నీలా నేను పిరికివాడిని కాదు. నేను పారిపోను అంటూ పోసాని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు తట్టుకోలేకపోతే.. విరమించుకో అంటూ పోసాని కృష్ణ మురళీ హెచ్చరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X