For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్‌కు మద్దతివ్వను.. ఆ హీరో మానసిక రోగి.. ఎందరు పెళ్లాలు ఉన్నారో.. పోసాని

  By Rajababu
  |

  నటుడు, రచయిత, దర్శకుడు పోసారి కృష్ణమురళిది విలక్షణమైన వ్యక్తిత్వం. ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్టు చెబుతారు. ఎవరినైనా మొహమాటం లేకుండా విమర్శిస్తాడు. ఇటీవల ఓ టెలివిజన్ చానెల్‌తో మాట్లాడుతూ. కమల్ హాసన్, చిరంజీవి, పవన్ కల్యాణ్‌పై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పోసాని మురళి వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..

  Recommended Video

  Posani Krishna Murali Reacted on Ram Gopal Varma's NTR Biopic
  డబ్బు మనిషిని కాను

  డబ్బు మనిషిని కాను

  పోసాని కృష్ణ మురళి అడుగు బయటపెడితే లక్ష రూపాయలు ఇచ్చుకోవాలి అనే మాట సరికాదు. అలా చెప్పేటప్పుడు నేను సినిమా తీసి చేతుల కాల్చుకొన్న విషయం. ఇళ్లు అమ్మి డబ్బులు ఫైనాన్స్ కట్టిన విషయం గురించి చెప్పాలి. ఎందుకంటే నేను అప్పుల పాలైన విషయం కూడా చెప్పాలి కదా. తీసుకొనే డబ్బుల గురించి చెప్పితే సరిపోదు.

  సుమను డబ్బులడిగా

  సుమను డబ్బులడిగా

  ఏదైనా ప్రొగ్రాంలకు వెళ్లితే డబ్బులు అడుగుతాననడం నిజమే. కమర్షియల్ చానెళ్లకు వెళితే డబ్బులు అడిగాను. యాంకర్ సుమ, ఓంకార్, ఖుష్భూ పిలిస్తే డబ్బులిస్తేనే వస్తాను అని చెప్పాను. ఎందుకంటే అలా వచ్చే డబ్బును సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తాను. చాలా మందికి గుండె ఆపరేషన్లు చేయించాను. పాన్ పరాగ్ కార్యక్రమాలకు, ఇతర వ్యాణిజ్యమైన కార్యక్రమాలకు నేను వెళ్లను.

  కులం పేరుతో ఓట్లు అడిగలేదు

  కులం పేరుతో ఓట్లు అడిగలేదు

  ఇక ఎన్నికల్లో నేను పోటీ చేయను. రాజకీయాల్లో ఉంటాను కానీ ఎలక్షన్లలో పాలుపంచుకొను. కులం పేరుతో ఓట్లు అడుగలేదు. ప్రచారానికి వెళ్లితే మనం కమ్మ కులం. మీరు కాపుల పార్టీలో ఎలా నిలబడుతారు. కాపులు గెలిస్తే మనల్ని బతకునివ్వరు అని కొందరు మహిళలు ప్రస్తావించారు. అయితే నాకు ఓటు వేయవద్దు అని చెప్పాను.

  పవన్ మద్దతు ఇవ్వలేదు..

  పవన్ మద్దతు ఇవ్వలేదు..

  రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌కు నేను మద్దతు ఇవ్వను. వైఎస్ జగన్‌కు మాత్రమే సపోర్ట్ ఇస్తాను. ఎందుకంటే జగన్ సీఎం అయి సరిగా పనిచేయకపోతే నేను అల్టర్‌నేట్ ఆలోచిస్తాను.

  మా నాన్న ఆత్మహత్య చేసుకోన్నాడు

  మా నాన్న ఆత్మహత్య చేసుకోన్నాడు

  జూదానికి అలవాటు పడి మా నాన్న ఆస్తంతా నాశనం చేశాడు. వంద రూపాయాలు అప్పుపుట్టకపోతే అవమానంగా భావించాడు. ఫుల్ బాటిల్ మందు తాగి పొలంలో ఆత్మహత్య చేసుకొన్నాడు. టమాట బస్తాలు కుట్టే కూలి పని చేశాను. గుంటూరులోని ఓ టాకిస్‌లో టికెట్లు అమ్మాను. చాలా కిందిస్థాయి నుంచి వచ్చాను. డబ్బు విలువ నాకు బాగా తెలుసు.

  విజయ్ డైలాగ్స్‌ను ఒప్పుకొను

  విజయ్ డైలాగ్స్‌ను ఒప్పుకొను

  అదిరింది చిత్రంలో జీఎస్టీపై విజయ్ డైలాగ్‌లు చెప్పించి చప్పట్లు కొట్టించారు. దానిని నేను సమర్థించను. సింగపూర్ హైదరాబాద్ అంతా కూడా ఉండదు. అక్కడ 7శాతం జీఎస్టీ ఉంటే దానితో పోల్చడం సరికాదు. అయితే సినిమా వాళ్లు ఎక్కువగా నగదు రూపంలోనే రెమ్యూనరేషన్ తీసుకొని బ్లాక్ మనీగా మార్చుకొంటున్నారు. ఎందుకలా చేస్తున్నారు అని విజయ్ సినిమాలో డైలాగ్స్‌తో ప్రశ్నిస్తే నేను భేష్ అంటాను.

  డబ్బుల కోసమే టెలివిజన్..

  డబ్బుల కోసమే టెలివిజన్..

  డబ్బులు సంపాదించడానికే టెలివిజన్ పరిశ్రమలోకి వచ్చాను. ప్రజలకు చేరువ అవ్వడానికి వచ్చాను అని నేను చెప్పను. మోసం చేయను. టెలివిజన్ రంగంలో శృంగారం ఎక్కువడం అభ్యంతరకరం కాదు. ప్రజలు చూస్తున్నప్పుడు మనవెవరం అడ్డు చెప్పడానికి.

  చిరంజీవి మంచి మనిషి

  చిరంజీవి మంచి మనిషి

  చిరంజీవి చాలా మంచి మనిషి. మధ్య తరగతి మనస్తత్వం. నేను బాగున్నాను. వేరొకరని బాధపెట్టాలనే మెంటాలిటీ లేదు. అందుకే ఆయన పార్టీలో చేరాను. ఆయన టికెట్ ఇస్తే పోటీ చేశాను. చిరంజీవి అవినీతి పరుడు కాదు. రాజకీయాల్లో ఎలాంటి వాళ్లు ఉంటారో అంచనా వేయడంలో చిరంజీవి విఫలమయ్యారు.

  ప్రజలు భావిస్తే పవన్ సీఎం

  ప్రజలు భావిస్తే పవన్ సీఎం

  గడప గడపకు వెళ్లి ప్రజల హృదయాల్లో చోటు సంపాదించిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు. ప్రజలు ఎన్నుకుంటే మనవెవరం ఆపడానికి. పవన్ కల్యాణ్ సరైన వ్యక్తి అని ప్రజలు భావిస్తే ముఖ్యమంత్రి అవుతాడు.

  కమల్ హాసన్ మానసిక రోగి

  కమల్ హాసన్ మానసిక రోగి

  కమల్ హాసన్ ఓ మానసిక రోగి. జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ఓ సందర్భంలో టీవీ ముందుకు వచ్చి ఏడ్చాడు. జయలలిత చనిపోయిన తర్వాత మళ్లీ వచ్చి ధైర్యం వచ్చింది. నోట్ల రద్దు కరెక్ట్ అని, మళ్లీ అది తప్పు అన్నాడు. రోజుకోసారి మాట మార్చేవాడు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలను ఉద్దరిస్తాడా? హిందూ టెర్రరిజం అని కమల్ చెప్పడాన్ని తీవ్రంగా అభ్యంతరం చెప్పాడు.

  ఎంతమంది జీవితాలు నాశనం

  ఎంతమంది జీవితాలు నాశనం

  కమల్ హాసన్‌పై ధ్వజమెత్తుతూ ఆయనకు ఎంత మంది పెళ్లాలు.. గొల్లాలు ఉన్నారు. భార్యతో తప్ప మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోలేదా? హీరోయిజంను అడ్డుపెట్టుకొని ఎంత మంది జీవితాలను నాశనం చేశావో లైడిక్టర్ పరీక్షలు జరిపించుకొని చెప్పాలి.

  English summary
  Actor Posani Krishna Murali is versatile film personality. He made serious comments on Kamal Hassan. He said Kamal is mentally sick. Chiranjeevi is good person. If People feels Pawan Kalyan will be Chief Minister.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X