»   » చిరంజీవిపై, 150వ సినిమాపై... వినాయక్ పై పోసాని కామెంట్స్ (వీడియో)

చిరంజీవిపై, 150వ సినిమాపై... వినాయక్ పై పోసాని కామెంట్స్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని మరోసారి బయట పెట్టారు ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి. తాజాగా ఆయన చిరంజీవి వ్యక్తిత్వం గురించి, 150వ సినిమా గురించి, వివి వినాయక్ గురించి మాట్లాడిన ఓ వీడియోను కొణిణెల ప్రొడక్షన్స్ వారు రిలీజ్ చేసారు.

చిరంజీవితో మనం ఎన్నాళ్లైనా ప్రయాణం చేయొచ్చు. మీరు చిరంజీవితో మాట్లాడండి.. మాట్లాడకపొండి.. ఎప్పుడు ఆయన దగ్గరికి వచ్చినా ఓ నమస్కారం పెట్టామంటే.. తిరిగి అంతే గౌరవంతో మనల్ని విష్‌ చేస్తారు. హ్యూమన్‌ క్వాలిటీలో ఆయన చిరంజీవులు. అందుకే ఆయనంటే నాకు బాగా ఇష్టం అన్నారు.150వ సినిమా గురించి...

150వ సినిమా గురించి...

‘ఖైదీ నంబరు 150' చిత్రం నేరుగా 150 రోజులు ఆడాలని కోరుకుంటున్నానని, నాకు నచ్చిన దర్శకుడు వివి వినాయక్ ఈ సినిమా చేస్తున్నారు.... ఈ సినిమా కోసం నేను అందరిలాగే ఆసక్తిగా ఎదురు చూస్తున్నానన్నారు.


కించ పరిచే వాడు కాదు

కించ పరిచే వాడు కాదు

వివి వినాయక్ ను నేను వినయ్ అని పిలిచే వాడిని. చిన్నప్పటి నుంచి వినయ్‌ తెలుసు. వ్యక్తిగతంగా ఆయనంటే ఇష్టం.. ఎవర్నీ కించపరచకుండా జెంటిల్‌మెన్‌లా ఉంటారు. దర్శకుడు, నిర్మాత పరంగా ఈ చిత్రం నాకు ప్రత్యేకమని తెలిపారు.


రామ్ చరణ్ గురించి..

రామ్ చరణ్ గురించి..

రామ్ చరణ్ నాకు ‘ధృవ' చిత్రంలో నాకు ఎంతో మంచి పాత్ర ఇచ్చారు. చిరంజీవితో, ఆయన కుటుంబంతో నా సినీ జీవితంలో చాలా సంతోషపడ్డ సంఘటనలు ఉన్నాయి అని పోసాని తెలిపారు.


చిరు నిజాయితీ పరుడే, కానీ పవన్.... : పోసాని సంచలనం

చిరు నిజాయితీ పరుడే, కానీ పవన్.... : పోసాని సంచలనం

చిరు నిజాయితీ పరుడే, కానీ పవన్.... : పోసాని సంచలనం.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిEnglish summary
Posani Krishna Murali shares why KhaidiNo150 is a special film for him at so many levels!, Check out video.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu