అశ్వినీదత్ ఉత్తమ లోఫర్, మోసగాడు.. రజనీ కాదు చిరంజీవి మా సూపర్‌స్టార్.. పోసాని ఘాటైన వ్యాఖ్యలు
తెలుగు సినిమా పరిశ్రమలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రెండు రోజుల క్రితం విజయవాడలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు.ఆ వివాదం ఒకవైపు కొనసాగుతుండగానే.. సోమవారం మే 1వ తేదీన జరిగిన నిర్మాతల మండలి సమావేశం మరో వివాదానికి దారి తీసింది. ఈ ప్రెస్ మీట్‌లో నిర్మాత అశ్వినీదత్ చేసిన ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండా వ్యాఖ్యలపై పోసాని ఘాటు స్పందిస్తూ..
అశ్వినీదత్ ఏమన్నారంటే?: నంది అవార్డులు ఇవ్వకపోవడంపై నిర్మాత అశ్వినీదత్ ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం నడుస్తున్న సీజన్ వేరు. ఉత్తమ రౌడీలు, ఉత్తమ గుండాలకు అవార్డులు ఇస్తారు. సినిమాలకు ఇవ్వాల్సి వస్తే.. మరో రెండు సంవత్సరాలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండేళ్ల తర్వాత ఏమైనా ఘనంగా ఇస్తారేమో వేచి చూడాల్సిందే అని అశ్వినీదత్ అన్నారు.

ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ లోఫర్ అంటూ: అయితే నిర్మాత అశ్వనీదత్ వ్యాఖ్యలపై ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి ఘాటుగా స్పందించారు. అశ్వినీదత్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఉత్తమ రౌడీ, ఉత్తమ గుండా అని కాదు.. మీకు ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ లోఫర్, ఉత్తమ మోసగాడు అనే అవార్డు ఇవ్వాలి అని పోసాని మురళీ కృష్ణ వ్యాఖ్యలు చేశారు.

మీ వాళ్లే ఉత్తమ వెధవలు: అంతేకాకుండా మరో అడుగు వేసి అశ్వినీదత్‌ను పోసాని మురళి టార్గెట్ చేశారు. ఉత్తమ వెధవలు ఉత్తమ సన్యాసులు అని మీ వాళ్ళకే ఇవ్వాలి అంటూ ఆయన సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే అశ్వినీదత్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అయితే సినీ వర్గాలు కానీ.. అశ్వినీదత్ కానీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

రజనీకాంత్ సూపర్ స్టార్ కాదు..: ఇదిలా ఉండగా, పోసాని కృష్ణమురళి రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. రజనీకాంత్ రోజు చెన్నై నుంచి విజయవాడ వచ్చి చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తితే మాకు ఎలాంటి సమస్య లేదు. ఆయన తమిళ ప్రజలకు సూపర్ స్టార్. మా తెలుగు వాళ్లకు సూపర్ స్టార్ కాదు అంటూ మరో కొత్త పాయింట్‌ను పోసాని లేవనెత్తారు.

మాకు చిరంజీవి సూపర్ స్టార్: తెలుగు వాళ్లకు ఓ సూపర్ స్టార్ ఉన్నారు. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవికి ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఎంతో ప్రేమ. అలాగే చిరంజీవి అంటే వైఎస్సార్ గారికి ఇచ్చినంత గౌరవం వైఎస్ జగన్ ఇస్తారు అంటూ పోసాని వ్యాఖ్యానించారు. అయితే రజనీకాంత్‌పై పోసాని వ్యక్తీకరించిన అభిప్రాయంపై ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











