చచ్చిపోయే పరిస్థితిలో లేను, ఆయన వల్లే: రూమర్లపై పోసాని ఏమన్నారంటే...

ప్రముఖ తెలుగు నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళి అనారోగ్యం పాలై ఇటీవల ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. వైద్యులు ఆయనకు సర్జరీ కూడా నిర్వహించారు. సర్జరీ అనంతరం వైద్యుల సూచన మేరకు ఇంటి వద్దే ఉండి విశ్రాంతి తీసుకుంటున్నారు. కొన్ని రోజులుగా సినిమా షూటింగుల్లో కూడా పాల్గొనడం లేదు.

అయితే రెండు మూడురోజులు రోజులుగా పోసానిపై సోషల్ మీడియాలో అభిమానులు ఆందోళన పడేలా రూమర్లు చెలరేగిపోయాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, మరోసారి ఆయన ఆసుపత్రిలో చేరినట్లు, ఆయన చనిపోయే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు రావడంతో చాలా మంది షాక్ అయ్యారు. ఈ వార్తలపై పోసాని తాజాగా స్పందించారు.

అనారోగ్యం నిజమే... చచ్చిపోయేంత కాదన్న పోసాని

అనారోగ్యం నిజమే... చచ్చిపోయేంత కాదన్న పోసాని

‘కొన్నాళ్లుగా నా ఆరోగ్యం బాగోలేదని, విషమంగా ఉందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చినట్లు మా ఫ్రెండ్స్ చెప్పారు. నిజమే నాకు అనారోగ్యం వచ్చింది.. కానీ చచ్చిపోయేంత కాదు. చూస్తున్నారుగా... మీ ముందు నేను మాట్లాడుతున్నాను. నాకు అనారోగ్యం వస్తే యశోదా ఆసుపత్రిలో చేరాను. డాక్టర్ ఎన్.వి. రావుగారు నన్ను బ్రతికించారు. పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిని చేశారు.' అని తెలిపారు.

కంగారు పడొద్దు, త్వరలో షూటింగులో..

కంగారు పడొద్దు, త్వరలో షూటింగులో..

నా ఆరోగ్యం గురించి మీకు(అభిమానులకు) ఎలాంటి ఆందోళన వద్దు. వారం పది రోజుల్లోనే మళ్లీ షూటింగులకు వెళ్లబోతున్నాను. ఇన్నాళ్లు నా ఆరోగ్యం గురించి కంగారు పడ్డవారికి నేను బావుండాలని పూజించిన వారికి శతదాకృతజ్ఞతలు... అని పోసాని వ్యాఖ్యానించారు.

సమస్య గురించి ముందే చెప్పిన పోసాని

సమస్య గురించి ముందే చెప్పిన పోసాని

''నాకు నడుము కింది భాగంలో గజ్జల్లో ఇబ్బంది కిలిగింది. దాని వల్ల సరిగా నడవలేక పోతున్నాను. యశోద ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ చేయాలనిచెప్పారు. మహేష్ బాబు నటిస్తున్న 'మహర్షి', ఇంకా కొన్ని సినిమా షూటింగులు ఉన్నాయి కాబట్టి అవి ఆగిపోకూడదని ఆపరేషన్ వాయిదా వేయించుకున్నట్లు'' పోసాని గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన ఈ ప్రకటన చేసిన కొన్ని రోజుల తర్వాత ఆపరేషన్ జరిగింది.

పోసాని హ్యాపీ హ్యాపీ

పోసాని హ్యాపీ హ్యాపీ

ఎన్నిల ముందు నుంచి వైసీపీ తరుపున ప్రచారం చేస్తున్న పోసాని.... ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నిక కావడంపై హ్యాపీగా ఉన్నారు. తన జీవితంలోని అన్ని కోరికలు తీరాయని, ఏపీ ప్రజలు సంతోషంగా ఉంటారని, జగన్ పాలనలో రాష్ట్రం పూర్తి సుభిక్షంగా ఉంటుందని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X