twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా అయితే మహేష్ బాబు వెంటపడేవాడిని, వంశీ తెలుగు సినిమాలు తీయొద్దు: పోసాని కామెంట్

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. సినిమా తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు మంచి వసూళ్లతో దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత దిల్ రాజు, అశ్వినీదత్ ఆదివారం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబుతో పాటు అల్లరి నరేష్, దేవిశ్రీ ప్రసాద్; పోసాని కృష్ణ మురళి, పృథ్వీ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ... 'ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్ మూవీ ఇదే అవ్వొచ్చు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనిపిస్తోంది. డైరెక్టర్ వంశీ ఇక నువ్వు తెలుగు సినిమాలు తీయొద్దు. హాలీవుడ్ సినిమాలు తీయాలి' అని వ్యాఖ్యానించారు.

    Posani Krishna Murali speech at Maharshi Sucess Meet

    వంశీ సినిమాలు చాలా చూశాను. ఎలాంటి కథ అయినా ఆ కథకు తగిన విధంగా సినిమా తీస్తూ టేకింగ్ విషయంలో తనకంటూ స్టైల్ ఉంటుంది. అంతా క్లియర్‌గా జర్క్ లేకుండా ప్రతి ఫ్రేము అందంగా ఉంటుంది. అది ఫోటోగ్రఫీ గొప్పదనం అనుకుంటాం. కానీ కాదు... ఇతనే స్టైల్‌గా ప్రేమ్ చేస్తూ ఉంటాడు.

    ఈ సినిమాలో మహేష్ బాబును చాలా అందంగా కనిపించాడు. 'మహేష్ బాబు... నేను ఆడ పిల్లగా పుడితే నువ్వు పెళ్లి చేసుకునే వరకు నీ వెంట పడుతుండేవాడిని'... ఒక వేళ నువ్వు పెళ్లి చేసుకున్నా ఎక్కడైనా ఓ ప్లేసులో నన్ను పెట్డండి అనేవాడిని. నాకు చిన్న ప్లేసు ఇస్తే మిమ్మల్ని చూసుకుంటా బ్రతుకుతాను. పిల్ల లేక పోయినా పర్వాలేదు. ఈ సినిమాలో అంత అదంగా ఉన్నావు. సినిమా చూస్తే మగాళ్లకు జలసీ ఉంటుందని పోసాని చెప్పుకొచ్చారు.

    తెలుగు సినిమా ఇండస్ట్రీని సగం బ్రతికిస్తుంది దిల్ రాజుగారి బ్యానరే అని గర్వంగా చెప్పగలను. అందరూ రెండేళ్లకో సినిమా, సంవత్సరన్నరకో సినిమా చేస్తారు. పెద్ద హీరోల సినిమాలు సంవత్సరానికి మహా అయితే 10 వస్తాయి. కానీ ఇండస్ట్రీలో కొన్ని వేల మంది ఉన్నారు. దిల్ రాజుగారు పెద్ద హీరో సినిమాను ఎంత ప్రేమించి తీస్తారో చిన్న సినిమా అయినా అంతే ప్రేమగా, అంతే కసితో సినిమా తీస్తారు. దీని వల్ల ఇండస్ట్రీలో డైరెక్టర్లు, టెక్నీషియన్లు, ఆర్టిస్టులు, కారు డ్రైవర్‌తో ఉపాది పొందుతున్నారు. ఒకప్పుడు నేను మద్రాసులో ఉన్నపుడు అశ్వినీదత్ గారిది టాప్ బేనర్. మహేష్ బాబు హీరోగా ఆయనే మొదటి సినిమా చేశారు. ఇపుడు మహేష్ బాబు 25వ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉందని పోసాని చెప్పుకొచ్చారు.

    English summary
    Posani Krishna Murali speech at Maharshi Sucess Meet. Maharshi directed by Vamshi Paidipally. Starring Superstar Mahesh Babu, Pooja Hegde, Allari NareshBanner : Sri Venkateswara Creations, Vyjayanthi Movies, PVP Cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X