ఇపుడు దానమ్మలా ఉన్నాడు, అవి నాకు నచ్చవు: పోసాని కామెంట్

Recommended Video

Posani Krishna Murali Speech At Majili Movie Thanks Meet || Filmibeat Telugu

నాగ చైతన్య, సమంత, దివ్యాంన్ష కౌశిక్ హీరో హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన 'మజిలీ' చిత్రం బాక్సాఫీసు వద్ద అదరగొడుతోంది. సినిమా విడుదలైన 10 రోజుల్లోనే రూ. 50 కోట్ల గ్రాస్, రూ. 30 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.

షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై శివ నిర్వాణ దర్శకత్వంలో సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించిన 'ఈ మూవీ థాంక్స్ మీట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి కొరటాల శివ, అనిల్ రావిపూడి గెస్టులుగా హాజరయ్యారు. ఈ సంర్భంగా పోసాని కృష్ణ మురళిమాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అప్పుడు బొమ్మలా ఉన్నాడు.. ఇపుడు దానమ్మలా ఉన్నాడు

అప్పుడు బొమ్మలా ఉన్నాడు.. ఇపుడు దానమ్మలా ఉన్నాడు

‘‘నాగ చైతన్య తొలి చిత్రం జోష్ చూసినపుడు బొమ్మలా అనిపించాడు... కానీ ఈ సినిమాలో దానమ్మలా ఉన్నాడు. దేవదాసు చూశాక తాగుబోతు పాత్రలో ఎవరిని చూసినా నచ్చేది కాదు. కృష్ణుడి పాత్ర రామరావు వేస్తే మిగతా వారిని ఆ పాత్రలో ఎలా చూడలేమో.. తాగుబోతు పాత్ర నాగేశ్వరరావు వేస్తే చూడలేం. కానీ నాగార్జున మజ్నులో వాళ్ల నాన్నలా కాకుండా తన ఫిజికల్ అడ్వాంటేజ్‌కి తగిన విధంగా చేసి సక్సెస్ అయ్యాడు. ఇపుడు నాగ చైతన్య కూడా తన స్టైల్‌లో చేశాడు'' అని పోసాని చెప్పుకొచక్చారు.

తన లిమిట్లో పర్ఫెక్టుగా చేశాడు

తన లిమిట్లో పర్ఫెక్టుగా చేశాడు

ఈ సినిమాలో కూడా నాగ చైనత్య వాళ్ల తాతలా, నాన్నలా కాకుండా తన బాడీ తాగుబోతు పాత్రకు ఎంత వరకు సహకరిస్తుంది, ఏ లిమిట్‌లో చేస్తే పర్ఫెక్టుగా కనిపిస్తాడో అదే లిమిట్లో చేశాడు. సినిమాలోని పాత్ర తీరు కూడా నాగ చైతన్యకు ప్లస్సయిందని పోసాని చెప్పుకొచ్చారు.

అలాంటివి నాకు నచ్చవు కానీ...

అలాంటివి నాకు నచ్చవు కానీ...

నాకు సెంటిమెంట్ పాత్రలు, కామెడీ పాత్రలు చేయాలని కోరిక. స్కూల్ డేస్‌లో బెస్ట్ కమెడియన్ అవార్డ్, యూనివర్శిటీలో బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డ్ వచ్చింది. నాకు నచ్చని పాత్రలు పోలీస్ పాత్రలు, ఫాదర్ పాత్రలు. మొదట్లో నాకు ఫాదర్ పాత్రలు ఇస్తే నా వయసు కనపడుతుందేమో, తొందరగా రిటైర్ అవుతానేమో అని కంగారుపడ్డాను. కానీ తండ్రి పాత్రలు నాకు చాలా పేరు తెచ్చాయి. నటుడిగా నా ట్రావెలింగుకు చాలా హెల్ప్ అయ్యాయన్నారు.

ఆ పాత్ర వేస్తే చాలా చండాలంగా ఉంటానేమో అనే భయం ఉండేది

ఆ పాత్ర వేస్తే చాలా చండాలంగా ఉంటానేమో అనే భయం ఉండేది

నాకు పోలీస్ పాత్రలు ఎందుకు ఇష్టం ఉండదంటే శ్రీహరికి చాలా పోలీస్ కథలు రాశాను. పోలీస్ అంటే శ్రీహరిలా ఫిట్‌గా ఉండాలి. నేను ఆ డ్రెస్ వేసుకుంటే చాలా చండాలంగా ఉంటానేమో అనే భయం. కానీ టెంపర్ మూవీలో అలాంటి పాత్రే వస్తే మంచి పేరు వచ్చింది. మజిలీలో నాకు ఒక మంచి ఫాదర్ పాత్ర ఇచ్చినందుకు శివ నిర్వాణకు థాంక్స్... అని పోసాని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X