చిరుకే ట్విస్టు ఇస్తున్న పోసాని

పోసాని కృష్ణ మురళి తాజాగా ముఖ్యమంత్రి వైయస్ పై ప్రశంసలు వర్షం కురిపించి సంచలనం సృష్టించారు. వైయస్ గొప్ప మానవతావాది అని పొగిడారు. స్నేహానికి ప్రాణమిస్తారని,స్నేహానికి ఆయనిచ్చే విలువ అంతా ఇంతా కాదని కొనియాడారు. సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనటానికి రామ్ నగర్ (హైదరాబాద్) వచ్చిన పోసాని మీడియాతో మాట్లాడుతూ వైయస్ ప్రభుత్వ పాలనపై పై విధంగా స్పందించారు. అలాగే రాజశేఖర్ రెడ్డిలో ఎన్నో మంచి లక్షణాలు,సుగుణాలు ఉన్నందునే ముఖ్యమంత్రి అయ్యారని,అంతకంటే ఎక్కువ సుగుణాలు చిరంజీవిలో ఉన్నప్పుడే ఆయన సీఎం అవుతారని స్పష్టం చేసారు.
అంతేగాక రాజశేఖర్ రెడ్డిలో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయన్నారు. వైఎస్ పేదల కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నారని,ఆయన చేసే ప్రతి పని మంచిదేనని కొనియాడారు.అయితే పలు ప్రాంతాల్లో జరుగుతన్న భూ కబ్జాలు,ప్రాజెక్టుల్లో అవినీతి వంటివి వైయస్ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని,అయితే ఇవన్నీ వైయస్ కి తెలిసి జరుగుతున్నాయని తాను అనుకోవటం లేదని అన్నారు. ప్రజారాజ్యంలో చేరి ఇలా మాట్లాడితే ఎలా అని మీడియా వ్యక్తులు ప్రశ్నించగా గుడ్డిగా నేను ఎవరిని సమర్ధించనని ఎవరు మంచిపని చేస్తే వారిని సమర్ధిస్తానని,తప్పు చేసే వారిని కూడా నిందిస్తానన్నారు.
ఇక పోసాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజారాజ్యంలోనూ కలవరం రేపుతున్నట్లు సమాచారం. దాంతో కొందరు ఆయన్ని నిజంగా మెంటల్ కృష్ణే అంటున్నారు. మరి కొందరు ప్రజారాజ్యంనుండి తన నేటివ్ ప్లేసులో సీటు ఆశిస్తున్నారని, అది చిరంజీవి ఇస్తానని చెప్పకపోవటంతో ఇలా ప్లేటు ఫిరాయిస్తున్నాడని విశ్లేషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











