పోసాని కృష్ణ మురళి...‘టోల్ ఫ్రీ నెం.143’
హైదరాబాద్: భాస్కరా గ్రూప్ ఆఫ్ హీడియా పతాకంపై పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలో వి.ఎన్.వాసు తెరకెక్కిస్తున్న చిత్రం ‘టోల్ ఫ్రీ నెం. 143'. దాసరి భాస్కర యాదవ్ నిర్మాత. క్లబ్బులు, పబ్బులు, రేవ్ పార్టీలు అంటూ నేటి తరం యువత తమ జీవితాన్ని ఏ విధంగా పాడు చేసుకుంటున్నారో ఈ చిత్రం ద్వారా చెప్పనున్నారు.
చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈచిత్రం ఆడియోను సెప్టెంబర్‌లో విడుదల చేసి, అక్టోబర్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ...‘నేటి యువత చెడు దారులు పడుతూ...ఏ విధంగా తమ కెరీర్ నాశం చేసుకుంటున్నారో చూపించనున్నాం. వారిని సక్రమమైన మార్గంలో నడిపించే వ్యక్తిగా పోసాని చాలా మంచి పాత్రలో కనిపించనున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం' అన్నారు.

దర్శకుడు వి.ఎన్.వాసు మాట్లాడుతూ...‘టోల్ ఫ్రీ నెం.143' చిత్రీకరణ పూర్తయింది. మా నిర్మాత దాసరి భాస్కర్ యాదవ్ గారి సహకారంతో సినిమా చాలా బాగా వచ్చింది. పోసాని కృష్ణ మురళిగారి క్యారెక్టర్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. అలాగే...కృష్ణ భగవాన్, సుమన్ శెట్టి, ధనరాజ్, రోలర్ రఘు, చమ్మక్ చంద్ర వంటి కమెడియన్లు ఆద్యంతం నవ్విస్తారు' అన్నారు.


Click it and Unblock the Notifications











