ఓకే అనిపిస్తేనే, పవన్ పార్టీపై పోసాని మెలిక!

By Bojja Kumar

Posani Krishna Murali welcomes Pawan Kalyan's party
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీపై దర్శకుడు, రచయిత, నటుడు తనదైన రీతిలో స్పందించారు. పార్టీ స్థాపించాలని పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. పవన్ కళ్యాణ్ పెట్టబోయే పార్టీకి ఓటేస్తారా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.....పవన్ కళ్యాణ్ ప్రసంగం విన్నాకే ఓటేయాలా? లేదా? అనే విషయం ఆలోచిస్తా, ఆయన మాటలు, పార్టీ విధానాలు నాకు ఓకే అనిపించే విధంగా ఉండాలి, అప్పుడే ఓటేస్తా అంటూ మెలిక పెట్టారు పోసాని.

తనకు రాజకీయాల్లోకి కొనసాగే ఉద్దేశ్యం లేదని, నాయకుడిగా ఉండదలుచుకోలేదని, ఓటరుగానే ఉంటానని పోసాని కృష్ణ మురళి స్పష్టం చేసారు. గతంలో చిరంజీవిపై అభిమానంతో ఆయన పార్టీ తరుపున చిలకలూరిపేట నియోజకవర్గం నుండి పోటీ చేసానని, అయితే ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా ఓటర్లకు పంచలేదని అన్నారు.

అయితే ప్రస్తుతం తాను రాజకీయ సన్యాసం తీసుకున్నానని....భవిష్యత్తులో కూడా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని పోసాని స్పష్టం చేసారు. ఒక వేళ ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఉంటే గనుక పోటీ చేసే వాడినని పోసాని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తన మనసుకు నచ్చిన వారికే ఓటేస్తానని పోసాని స్పష్టం చేసారు.

పవన్ కళ్యాణ్ స్థాపించబోయే జనసేన పార్టీ విషయానికొస్తే....ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో పవన్ కళ్యాణ్ కొత్త పార్టీని ఆవిర్భవించబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ తెరలు ఏర్పాటు ఆయన ప్రసంగాన్ని లైవ్ ప్రసారం చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X