ఆర్మీ మేజర్ గా పోసాని 'నిశ్శద్ద యుద్దం'
ఆర్మీ మేజర్‌గా పోసాని కృష్ణమురళి, సూర్యారావు, సునాక్షి జంటగా తోట కృష్ణ దర్శకత్వంలో లైఫ్ కేర్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రై.లి. సంస్థ నిర్మిస్తున్న 'నిశ్శబ్ద యుద్ధం' చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంతో జరుగుతోంది. ఈ నెల 22తో రెండు పాటలు, క్లైమాక్స్ మినహా చిత్రం పూర్తవుతుందని దర్శకుడు చెప్పారు. వైవిధ్యమైన ప్రేమకథగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోందని ఆయన తెలిపారు. ఈ సినిమాలో ముఖ్య భూమిక పోషిస్తున్న డా.శివప్రసాద్ మాట్లాడుతూ' పరిశ్రమకి ఈ రోజు అవసరమైన పద్ధతుల్లో ఈ చిత్రాన్ని దర్శకుడు కృష్ణ తీస్తున్నారు.
నిర్మాతలు నిర్మాణపరంగా ఎక్కడా రాజీపడటంలేదు' అన్నారు. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు హీరో హీరోయిన్లు ఆనందం వ్యక్తం చేశారు. ఈ బేనరుపై దర్శకుడు తోట కృష్ణ దర్శకత్వంలో వరుసగా సినిమాలు నిర్మిస్తామని నిర్మాణ సారథి శ్రీనివాస్ చెప్పారు. శివాజీరాజా, హేమ, డా. శివప్రసాద్, మాగం వాసు, నర్సింగ్ యాదవ్, సూర్య, సారిక రామచంద్రరావు, కళ్లు చిదంబరం, శ్రీకళ, శ్రీమణి, శృతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: జయకుమార్, పైట్స్: థ్రిల్లర్ మంజు.


Click it and Unblock the Notifications











