చనిపోతానని భయపడ్డా.. ఆయన లేకపోతే శాల్తీ గల్లంతే.. పోసాని

నటుడు, రచయిత, సినీ దర్శకుడు, రాజకీయ నేత పోసాని మురళీకృష్ణ ఆరోగ్యంపై అనేక రకాల వార్తలు వెలువడ్డాయి. ఓ దశలో ఆయన ఆరోగ్యం విషమమని వార్తలు షికారు చేశాయి. దాంతో మీడియాలో, సినీ, రాజకీయ వర్గాలు ఆందోళనకు గురయ్యాయి. తాజాగా తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలు, అసత్య ప్రచారాలపై క్లారిటీ ఇవ్వడానికి పోసాని బుధవారం మీడియాతో మాట్లాడారు. పోసాని తన ఆరోగ్యం గురించి చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

ఇండస్ట్రీలో 33 ఏళ్లుగా

ఇండస్ట్రీలో 33 ఏళ్లుగా

నేను ఇండస్ట్రీకి వచ్చి 33 ఏళ్లు. ఎన్నోసార్లు నాకు అండగా నిలిచారు. నా అభిప్రాయాలను ప్రజలతో షేర్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడింది. మరోసారి మీడియా సహాయం తీసుకోవాలని ఈ ప్రెస్‌మీట్ పెట్టాను. మే 13 తారీఖున నా ఆరోగ్యం క్షీణించింది. రకరకాల పరీక్షలు జరిపినా నాకు ఆరోగ్యం మెరుగుపడలేదు. దాంతో మీడియాకు దూరంగా ఉన్నాను అని పోసాని పేర్కొన్నారు.

నాకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో

నాకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో

నా ఆరోగ్యం సహకరించకపోవడంతో హాస్పిటల్‌లో చేరాను. అక్కడ నాకు హెర్నియా ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత నాకు ఇన్‌ఫెక్షన్ సొకింది. నాకు సోకిన ఇన్‌ఫెక్షన్‌ను ఎవరూ గుర్తించలేదు. విపరీతంగా జ్వరంతో బాధపడ్డాను. ప్రతీ రోజు 104 నుంచి 106 డిగ్రీల జ్వరం వచ్చేది. ఇంజెక్షన్ ఇస్తే తగ్గేది. ఆ తర్వాత యధావిధిగా మారిపోయింది. దాదాపు రెండు నెలలపాటు బాధపడ్డాను అని పోసాని వెల్లడించారు.

చనిపోతానేమోనని భయపడ్డా

చనిపోతానేమోనని భయపడ్డా

ఓ దశలో నేను చనిపోతానేమో బయపడ్డాను. మళ్లీ యశోదాలో చేరాను. దాంతో ప్రముఖ వైద్యుడు రావు గారికి ఫోన్ చేస్తే ఆ సమయంలో లండన్‌లో ఉన్నాడు. గతంలో కేసీఆర్‌కు రావు చికిత్స చేశారు. ఈ నేపథ్యంలో నాకు జ్వరం అనగానే ఆందోళనకు లోనై వెంటనే హైదరాబాద్ వచ్చారు. పరీక్షలు చేసిన తర్వాత నాలో ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించి గంటలోపే సర్జరీ చేశారు. లేకపోతే నా శాల్తీ గల్లంతయ్యేది అని అన్నారు.

నా ఆరోగ్యంపై అసత్య కథనాలు రాయొద్దు

నా ఆరోగ్యంపై అసత్య కథనాలు రాయొద్దు

నా ఆరోగ్యంపై రకరకాల వదంతులు వస్తుంటే ఆందోళనకు గురయ్యాను. సోషల్ మీడియా, య్యూట్యూబ్ ఛానెల్‌లో నా ఆరోగ్యం కట్టుకథలు వచ్చాయి. దాంతో చిన్న వీడియో బైట్ విడుదల చేయాల్సి వచ్చింది. అయినా నా మేసేజ్ రీచ్ కాలేదు. ప్రస్తుతం నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నా ఆరోగ్యంపై ఎలాంటి అసత్య కథనాలు రాయొద్దు అని పోసాని రిక్వెస్ట్ చేశారు అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X