బాలయ్యను సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదు.. పోసాని సెన్సేషనల్ కామెంట్స్
సినీ పరిశ్రమలో ఇప్పుడు ఏ ఇద్దరూ మాట్లాడుకున్నా అది బాలకృష్ణ చేసిన కామెంట్ల గురించే. సినీ ఇండస్ట్రీ చిరంజీవి నేతృత్వంలో ప్రభుత్వంతో చర్చలు జరపడం, దానికి బాలకృష్ణను పిలవకపోవడం, దానిపై బాలయ్య ఓ రేంజ్‌లో ఫైర్ అవ్వడం అందరికీ తెలిసిందే. భూములు పంచుకుంటున్నారా? అని సెన్సేషనల్ కామెంట్లు చేయడంతో ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంది. బాలయ్యపై నాగబాబు ఫైర్ అవ్వడంతో ఇది మరింత రాజుకుంది. వీటిపై ఎంతో మంది సినీ ప్రముఖులు స్పందించారు.
Recommended Video

బాలయ్య కామెంట్స్‌తో మొదలు...
సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలు, షూటింగ్‌లు ప్రారంభం, థియేటర్ల పున: ప్రారంభంపై ఓ నిర్ణయం తీసుకునేందుకు సినీ పెద్దలంతా చిరంజీవి నేతృత్వంలో ప్రభుత్వంతో చర్చించారు. ప్రభుత్వంతో సినీ పరిశ్రమ జరుపుతున్న చర్చల విషయం తనకు తెలియదని అన్నాడు. వారంతా భూములు పంచుకోవడానికి సమావేశం అవుతున్నారని కామెంట్స్ చేశాడు.

బాలయ్యపై నాగబాబు ఫైర్..
బాలయ్య వ్యాఖ్యలపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు. నోరు అదుపులో పెట్టుకోమని, మాటలు జాగ్రత్తగా రానీవ్వని హెచ్చరించాడు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే కుదరదని నువ్వేమీ కింగ్‌వి కాదు, కేవలం ఒక హీరోవేనని ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు.

స్పందించిన ప్రముఖులు..
వీరి వివాదంపై సినీ ప్రముఖులెందరో స్పందించారు. తమ్మారెడ్డి, సీ కళ్యాణ్ వంటివారు వివాదాన్ని సద్దుమణిగించేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే శ్రీ రెడ్డి, రాకేష్ మాస్టర్ వంటి వారు మధ్యలో దూరి ఈ వివాదాన్ని మరింత పెద్దది చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదు..
తాజాగా ఈ వివాదంపై పోసాని స్పందించాడు. ఈరోజు సాయింత్రం హైదరాబాద్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ..‘బాలయ్య కోపం, ఆవేశం... ఏదైనా సరే ఒక్క నిమిషమే. ఆయన వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదు. నేనైతే వాటిని సీరియస్‌గా తీసుకోవడం లేదు. మీరు కూడా తీసుకోకండ'ని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











