ఎన్నో ఇస్తా అన్నారు కానీ.. నా అంతిమ గోల్ జగన్.. పోసాని కామెంట్స్
రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి ఇటు సినిమాలతో బిజీగా ఉంటూనే అటు రాజకీయ కార్యకలాపాల్లో జోక్యం చేసుకొని వైసీపీకి సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. జగన్ ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా ఆయన సాగించిన రాజకీయ విప్లవం సక్సెస్ అయింది. దీంతో ఎంతో ఖుషీ అయ్యాడు పోసాని. అయితే వైసీపీ అధికారం లోకి వచ్చాక ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆఫర్ కూడా వచ్చిందని, కానీ తానే తిరస్కరించానని తాజాగా ఓ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు పోసాని.

ఎన్నికలకు ముందే ఆఫర్
ఎన్నికలకు ముందు నుంచే వైసీపీ హవా కొనసాగుతోందని, అయితే ఆ సమయంలోనే తనకు వైసీపీ తరపున ఏ పదవి ఆశిస్తున్నావని ఆఫర్ చేశారని పోసాని చెప్పాడు. కానీ తనకు వైసీపీ పార్టీ పట్ల, వైఎస్ పట్ల ఉన్న అభిమానంతో ఆ పార్టీ విజయాన్ని మాత్రమే కోరుకుంటూ ఏ పదవీ ఆశించలేదని చెప్పాడు పోసాని కృష్ణ మురళి.

నా అంతిమ గోల్ జగన్
మొదటి నుంచి తాను జగన్ సీఎం అయితే చాలు అనే కోరుకున్నానని, తనకు పదవి ఆఫర్ చేసినా వద్దని చెప్పేశానని పోసాని పేర్కొన్నారు. కొంతమంది పదవులు ఆశించే పార్టీకి సపోర్ట్ చేస్తారని, కానీ తాను ఆ టైపు కాదని స్పష్టం చేశాడు పోసాని. ఎగబడి పదవులు తీసుకునే అలవాటు తనకు లేదని ఆయన వెల్లడించాడు.

అడుక్కునే అలవాటు అసలే లేదు
తనకు ఏదైనా అడుక్కునే అలవాటు అసలే లేదని పోసాని అన్నారు. సినిమా ఇండస్ట్రీలో గానీ, ఉద్యోగం విషయంలో గానీ తాను మొదటి నుంచీ ఎవ్వరినీ బెగ్గింగ్ చేయలేదని ఆయన తెలిపాడు. ఇక ఎవరైనా తన వద్దకు వచ్చి ఈ పని చేసిపెట్టవా అని అడిగితే అస్సలు కాదనని పోసాని అన్నాడు. ఫలానా పాదాభి కావాలి, ఫలానా పని చేస్తా అని రికమండేషన్ చేయించుకోవడం తనకు నచ్చదని, అలాంటి వాటి జోలికి వెళ్లలేదని ఆయన చెప్పాడు.

ప్రజలకు, ప్రభుత్వానికి ఉపయోగపడే పనులు చేస్తా
తనలో ఫలానా పని చేసే సత్తా ఉందని నిజాయతీగా నమ్మి అప్పగించే పనులను తఃను టేకప్ చేస్తామని పోసాని చెప్పుకొచ్చారు. ప్రజలకు, ప్రభుత్వానికి ఉపయోగపడే పనులను అప్పగిస్తే తాను సమర్థంగా చేయగలనని తన అభిప్రాయం వ్యక్తం చేశారు పోసాని కృష్ణమురళి. దీంతో ఈయన మాట్లాడిన ఈ మాటలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

పోసాని ఆరోగ్య పరిస్థితులు
ఇటీవలే పోసాని తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. అయితే తన ఆరోగ్య పరిస్థులపై స్పందించిన పోసాని.. తాను ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, తన ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్ నమ్మవద్దని తెలిపాడు పోసాని కృష్ణమురళి.


Click it and Unblock the Notifications











