పోసాని ఈ సారి తన డైరక్షన్ లో రాబోతున్న కామిడీకి 'మెంటల్ కృష్ణ' అనే పేరు పెట్టారు. ఇంతకుముందు 'ఆపరేషన్ దుర్యోధన' సినిమాతో డైరక్టర్ గా తనలోని ఫైర్ ని తెరపై చూపించిన ఆయన ఇందులోనూ పొలిటకల్ సెటైర్స్ ,సామాజిక పరిస్ధితులపై చర్చ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడుట. ఇక ఆయన ప్రక్కన సత్యకృష్ణ హీరోయిన్ గా ఎంపికయిన సంగతి తెలిసిందే.నాగబాబు ఈ చిత్రంలోను ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.'ఆపదమొక్కులవాడు' సినిమాలో జరిగిన పొరపాట్లు ఈ చిత్రంలో రిపీట్ కాకూడదని సకల జాగ్రత్తలు తీసుకుంటున్నాడుట. ఇక పోసానే ఈ టైటిల్ రోల్ 'మెంటల్ కృష్ణ'ని పోషిస్తున్నాడు. మోహన్ మీడియా పతాకంపై మోహన్ వడ్ల నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ రెగ్యులర్ గా జర్గుతోంది. అలాగే ఇలాంటి మరెన్నో పొలిటికల్ ఎవర్ నెస్ తెచ్చే చిత్రాలు రావాలని,మిగతా వాళ్ళీ తీయాలని అందరూ కోరుకుంటున్నారు.