twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లక్ష కోట్ల అవినీతిపై డైలాగ్, జగన్‌ను అనలేదన్న పోసాని!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో లక్ష కోట్ల అవినీతి అంటూ పోసాని కృష్ణ మురళి డైలాగ్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే అది పరోక్షంగా వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్‌ను ఉద్దేశించి అన్న వ్యాఖ్యలే అనే ప్రచారం సాగుతుండటంతో పోసాని స్పందించారు. అవి జగన్‌ను ఉద్దేశించి అన్న డైలాగ్ కాదని, బళ్లారిలో గనుల అవినీతి పరుడి గురించే అని, ఓబులాపురం గనుల కేసులో గాలి జనార్ధన్ రెడ్డిపై అవినీతి రుజువైంది కాబట్టి.... ఆ డైలాగ్ ఆయనకు వర్తిస్తుందని, జగన్ ను ఉద్దేశించి కాదని స్పష్టం చేసారు.

    జగన్‌కు తాను మద్దతిస్తున్న మాట వాస్తవమే... కేవలం ఆరోపణల నేపథ్యంలో ఆయన జైల్లో ఉన్నారు, ఒక వేళ ఆయనపై కోర్టులో అవినీతి ఆరోపణలు రుజువైతే మద్దతు ఉప సంహించుకోవడంతో పాటు, ఆయన అవినీతి గురించి విమర్శిస్తానని స్పష్టం చేసారు. దేశంలో రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారంటే అది ముమ్మాటికీ ప్రజల తప్పే. అవినీతి పరుల్ని గట్టిగా నిలదీయక పోవడం వల్లనే వ్యవస్థ ఇలా తగలబడిందని వ్యాఖ్యానించారు.

    'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో తెలంగాణ వారి మనో భావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వారు పోరాటాలు చేసి వాటిని తొలగించేలా చేసారు. దేనికైనా రెడీ చిత్రంలో ఒక వర్గాన్ని కించపరిచే విధంగా సీన్లు ఉన్నాయి కాబట్టే ఆందోళన కార్యక్రమాలు చేసారు. వాళ్లు శాంతి కాముకులు కాబట్టే పిండం పెట్టి ఊరుకున్నారు. కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో ఎవరి మనో భావాలు దెబ్బ తీయలేదు. అందులో నేను చెప్పిన డైలాగులు కానీ, క్రిష్ దర్శకత్వం గానీ జగన్‌ను ఉద్దేశించి కాదని పోసాని తేల్చి చెప్పారు.

    English summary
    Actor and director Posani krishna Murali said that..."YSR Congress party president YS Jagan is a good person. Krishnam Vande Jagadgurum movie is not targets Jagan" He added.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X