twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘గీత గోవిందం’ ముద్దు సీన్ల ఎఫెక్ట్... థియేటర్లపై దండయాత్రే!

    By Bojja Kumar
    |

    విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా పరశురాం దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన 'గీత గోవిందం' చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత మూడు రోజులుగా తెలుగు మీడియాలో, ఇండస్ట్రీలో సర్కిల్‌లో, సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో ఇలా ఎక్కడ చూసినా ఈ సినిమా గురించిన చర్చే సాగుతోంది. అందుకు కారణం 'గీత గోవిందం' సీన్లు ముందే లీక్ అవ్వడం, ఈ చర్యకు బాధ్యులైన కొందరు వ్యక్తులను, విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకోవడమే. కారణాలేమైనా 'గీత గోవిందం'పై భారీ బజ్ ఏర్పడింది.

    విజయ్ దేవరకొండ క్రేజ్, ఆపై పాజిటివ్ బజ్

    విజయ్ దేవరకొండ క్రేజ్, ఆపై పాజిటివ్ బజ్

    అర్జున్ రెడ్డి ఎఫెక్టుతో విజయ్ దేవరకొండ అంటే యూత్‌లో ఒక క్రేజ్ ఏర్పడింది. దానికి తోడు ‘గీత గోవిందం' పాటలు, ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

     ముద్దు సీన్ల ఎఫెక్టుతో యూత్ దండయాత్ర ఖాయమేనా?

    ముద్దు సీన్ల ఎఫెక్టుతో యూత్ దండయాత్ర ఖాయమేనా?

    ఇటీవల లీకైన సీన్లలో విజయ్ దేవరకొండ, రష్మిపై చిత్రీకరించిన ఘాటైన ముద్దు సీన్లు కూడా ఉన్నాయి. ఈ సీన్లు యూత్ మీద బాగా ఇంపాక్ట్ చూపాయని అంటున్నారు. ఆ ఎఫెక్టుతో యూత్ అంతా థియేటర్లపై దండెత్తడం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

     ఆ మసాలా బాగా దట్టించారు

    ఆ మసాలా బాగా దట్టించారు

    ‘గీత గోవిందం' మూవీ మెయిన్ టార్గెట్ యూత్ ఆడియన్సే. ఈ సినిమాలో వారు ఇష్టపడే మసాలా బాగా దట్టించారు. కామెడీతో కూడిన రొమాంటిక్ సీన్లు ప్రేక్షకులకు థియేటర్లో గిలిగింతలు పెడుతుందట.

    సరికొత్త కథాంశం

    సరికొత్త కథాంశం

    గీత గోవిందం అనేది లవ్ బేస్డ్ స్టోరీ అయినప్పటికీ... అప్రోచ్ కొత్తగా ఉంటుందని, ఈ విషయంలో దర్శకుడు పరశురాం స్పెషల్ కేర్ తీసుకున్నారని, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను మెప్పిస్తుందట.

    మ్యూజిక్ హైలెట్

    మ్యూజిక్ హైలెట్

    సినిమాలో మ్యూజిక్ కూడా మరో హైలెట్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలి' అనే పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

    English summary
    Positive buzz on Geetha Govindam, Starring Rashmika Mandanna and Vijay Deverakonda in the lead roles, The movie is all set to hit the screens tomorrow, Aug 15.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X