తెలుగు సూపర్ స్టార్‌పై... పోస్టల్ స్టాంప్
కృష్ణపై పోస్టల్ స్టాంపు రిలీజ్ అయిన వెంటనే ఆయన అభిమానులు నవీన్ దావల, వంశీ పర్వతనేని, వేణు నాదెళ్ల, ప్రసాద్ సుంకర వాటిని తీసుకొచ్చి తమ అభిమాన హీరోను పర్సనల్‌గా కలిసి బహూకరించారు. పోస్టల్ స్టాంపు రిలీజ్ పై కృష్ణ, మహేష్ బాబు అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.
ఇటీవల విడుదలైన 'సేవకుడు' చిత్రంలో చివరి సారిగా కనిపించిన కృష్ణ ఇకపై ఏ సినిమాలోనూ నటించకూడదని నిర్ణయించుకున్నారు. తన ఆరోగ్యం సహకరించడం లేదని, దాంతో సినిమాల నుంచీ రాజకీయాల నుంచీ తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని ఇటీవల ఆయన ప్రకటించారు.
ఆయన 350కి పైగా చిత్రాల్లో నటించారు. తాను ఛత్రపతి శివాజీ సినిమా తీయాలని అనుకున్నానని, నటనకు దూరంగా కావాలని నిర్ణయించుకోవడంతో అది స్వప్నంగానే మిగిలిపోతోందని కృష్ణ అన్నారు. కృష్ణ తన సొంత సినీ నిర్మాణ సంస్థ పద్మాలయా బ్యానర్‌పై పలు విజయవంతమైన సినిమాలను తీశారు. అల్లూరి సీతారామారాజు, మోసగాళ్లకు మోసగాడు, పాడి పంటలు వంటి విజయవంతమైన సినిమాల్లో ఆయన నటించారు. కౌబాయ్, డిటెక్టివ్ సినిమాలకు ఆయన పెట్టింది పేరుగా నిలిచారు.
అల్లూరి సీతారామరాజు సినినిమాతో తెలుగు తెరకు సినిమా స్కోప్‌ను, సింహాసనం సినిమాతో 70ఎంఎం మూవీని, తెలుగు వీర లేవరా సినిమాతో డిటిఎస్ మూవీని పరిచయం చేసింది ఆయనే. ఆయన 17 సినిమాలకు దర్సకత్వం కూడా వహించారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు.


Click it and Unblock the Notifications












