ఇంటెన్స్ ఫ్యామిలీ డ్రామాగా పోస్టర్.. సినిమా బ్యాక్‌డ్రాప్‌గా..

శ్రీ సాయి పుష్ప క్రియేష‌న్స్ లో టి.ఎం.ఆర్ ద‌ర్శ‌కుడు గా, విజ‌య్ ధ‌ర‌ణ్, అక్షత సోనావానే, రాశిసింగ్ హీరో హీరోయిన్స్ గా శేఖ‌ర్ రెడ్డి, గంగారెడ్డి, ఐ.జి.రెడ్డి నిర్మాత‌లు గా "పోస్టర్" అనే సినిమా రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే ఈ చిత్రం 80శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.

హీరో విజయ్ దరణ్ మాట్లాడుతూ- ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామాతో పాటు అన్ని ఎమోష‌న్స్ ఉన్న చిత్ర‌మిది.. ల‌వ్, డ్రామా ఆక‌ట్టుకుంటాయి" అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ " 80 శాతం టాకీ, రెండు పాటలు పూర్తి అయ్యాయి. మిగిలిన రెండు పాటలు ఔట్ డోర్ లో చిత్రీకరించడం జరుగుతుంది" అని తెలిపారు.

శివాజీ రాజా మాట్లాడుతూ- ఒక ద‌ర్శ‌కుడికి ఇది మొదటి సినిమా అయిన క్లారిటీగా, బాగా చేస్తున్నాడు. ప్ర‌తి ఒక్క‌రూ ఈ సినిమాని తమ సొంత సినిమాలా ఫీలయ్యి ప‌ని చేస్తున్నారు. క‌థ‌కు కరెక్ట్ గా సరిపోయే టైటిల్ "పోస్టర్" అన్నారు.

Poster movie is a Intense Family Drama

నటి మధుమణి మాట్లాడుతూ" హీరో తల్లిగా ఈ సినిమాలో నటిస్తున్నాను. డైరెక్టర్ పోస్టర్ కథ చెప్పినప్పుడే చాలా బాగా నచ్చింది. మధ్య తరగతి కుటుంబంలో కష్టనష్టాలను చూపిస్తూ ఒక కుర్రాడు ఉన్నత స్థానంలోకి వెళ్ళితే ఆ తల్లిదండ్రులు పొందే ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు టి.ఎం.ఆర్ గారికి, కృతజ్ఞతలు"అన్నారు.

ద‌ర్శ‌కుడు మ‌హిపాల్ రెడ్డి మాట్లాడుతూ - కొత్త పాత త‌రం న‌టీన‌టుల‌తో తీస్తున్న చిత్ర‌మిది. సిద్ధిపేట ప‌రిస‌రాల్లో, హైదరాబాద్ లో షూటింగ్ చెయ్యడం జరిగింది. సినిమా బ్యాక్ డ్రాప్ లో జరిగే క‌థ ఇది. పోస్ట‌ర్‌లు కూడా అతికించుకునెందుకు పనికి రాని ఓ కుర్రాడు పోస్టర్ మీదికి ఎలా ఎక్కాడు అనేది ఇంట్రస్టింగ్ డ్రామా తో చెప్పడం జరిగిందిఅన్నారు.

పోస్టర్ చిత్రంలో శివాజీరాజా, కాశీ విశ్వ‌నాథ్, మ‌ధుమ‌ణి, రామ‌రాజు, నివాస్, స్వ‌ప్నిక‌, కీర్తికా, అరుణ్ బాబు త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రానికి సంభాష‌ణ‌లు: నివాస్. కెమెరా: శ్రీ‌కాంత్‌, సంగీతం : శాండీ అద్దంకి, పాట‌లు: పెద్దాడ మూర్తి, చైత‌న్య వ‌ర్మ‌, ల‌క్ష్మీ ప్రియాంక‌, డ్యాన్స్‌: అజ‌య్ శివ‌శంక‌ర్, అమిత్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: ఆర్.శ్రీ‌నివాస్ రెడ్డి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X