twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనోజ్ 'పోటుగాడు' కి అన్ని థియోటర్లా??

    By Srikanya
    |

    హైదరాబాద్‌: రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై మంచు మనోజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'పోటుగాడు' . ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 14 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్‌ వడయార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మనోజ్ కెరీర్ లోనే భారీగా రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. ఎనిమిమిది వందల థియేటర్స్ లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

    ఈ విషయమై నిర్మాత మాట్లాడుతూ.... ఈ సినిమా మంచి హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఈ సినిమాని మేము బారీగా 800 థియేటర్స్ లో విడుదల చేయనున్నాము. దీనికి డిస్ట్రీబ్యూటర్స్ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా నాకు నచ్చిన అలాగే ప్రేక్షకులకు నచ్చిన సినిమా . నేను కచ్చితంగా చెబుతున్నాను ఈ సినిమా విజయాన్ని సాదించిన తరువాత ఈ 'పోటుగాడి' పేరు అందరి నోట వస్తుంది. ఈ సినిమాతో మనోజ్ ఒక ట్రెండ్ సెట్ చేసినవాడు అవుతాడు అన్నారు.

    ఈ చిత్రం ఓ కన్నడ రీమేక్ . కోమల్ హీరోగా వచ్చిన 'గోవిందాయ నమ:'.. చిత్రం తెలుగులో 'పోటుగాడు' గా తెరకెక్కుతోంది. కన్నడంలో దర్శకత్వం చేసిన పవన్‌ ఈ చిత్రానికి సైతం దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే 'పోటుగాడు' చిత్రాన్ని తమిళంలో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో నిర్మిస్తారు. 'పోటుగాడు' చిత్రంలో మంచు మనోజ్‌తో కలిసి ఓ పాటను పాడారు శింబు. ఇప్పటికే ఈ సాంగు రికార్డింగ్ కూడా పూర్తయింది. ఈ విషయాన్ని మంచు మనోజ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

    మంచు మనోజ్ చిత్రం గురించి చెప్తూ.. అటు పొగడ్తకి, ఇటు తెగడ్తకి రెండింటికీ సరిపోయే పదం 'పోటుగాడు'. నా శారీరకభాషకు సరిగ్గా సరిపోయే టైటిల్ ఇది. టైటిల్‌కి తగ్గట్టే ఇందులో తన పాత్ర కూడా ఉంటుందని మనోజ్ అంటున్నారు. కన్నడంలో హిట్ అయిన ఈ చిత్రాన్ని ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రూపుదిద్దామని, 45 రోజుల్లో షూ టింగ్ పూర్తి చేసిన ఈ సినిమా ఎంతో రిచ్‌గా వచ్చిందని, ఇప్పటివరకూ విడుదలైన ఆడియోలలో బెస్ట్ ఆడియోగా నిలుస్తుందని చిత్ర దర్శకుడు పవ న్ వడయార్ తెలిపారు.

    లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ- కన్నడంలో విజయవంతమైన చిత్రాన్ని తెలుగులో అదే దర్శకుడితో నిర్మిస్తున్నామని, యూనిట్ అంతా కలిసి ఈ చిత్రా న్ని తమ చిత్రంగా భావించి పనిచేశారని, ముఖ్యం గా మనోజ్ ఈ చిత్రంలో సరికొత్తగా కనిపిస్తాడని తెలిపారు. చక్రి, అచ్చు ద్వయం సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి లగడపాటి శ్రీధర్‌ నిర్మాత.

    సాక్షీ చౌదరి, సల్మాన్‌కౌర్ ముండి, రేచెల్ వియిస్, అనూ ప్రియా గోయెంకా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో పోసాని కృష్ణమురళి, అలీ, షాయాజీ షిండే, రఘుబాబు, చంద్రమోహన్, కె. ధన్‌రాజ్, వై.శ్రీనివాస్‌రెడ్డి, కె.శివశంకర్, గీతాసింగ్, సత్యం రాజేష్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, అచ్చు, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, మాటలు: శ్రీధర్ శీపన, పాటలు: రామజోగయ్య శాస్ర్తీ, కందికొండ, ఎస్. ఎ.కె. బాసా, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, నిర్మాతలు: శిరీషా-శ్రీ్ధర్, రచనా, దర్శకత్వం: పవన్ వడయార్.

    English summary
    
 Rock star Manchu Manoj’s upcoming film Potugadu is gearing for its grand release on Sep 14th. The film makers are planning to release in as many as 800 theatres. Manoj will essay a very mass role in this movie that has as many as four heroines. This film is going to be a comedy entertainer and the inside talk is good. Lagadapati Sridhar is producing this flick on Ramalakshmi Cine Creations. Achu is composing music for this film. Pawan Wadeyar has directed this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X