»   »  గ్లామర్‌తో టెమ్ట్ చేస్తున్న పోటుగాడు హీరోయిన్(ఫోటోలు)

గ్లామర్‌తో టెమ్ట్ చేస్తున్న పోటుగాడు హీరోయిన్(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హీరో మంచు మనోజ్ తాజా చిత్రం 'పోటుగాడు' చిత్రం ద్వారా ప్రేక్షకుల తెలుగు తెరకు పరిచయమైన భామ సాక్షి చౌదరి. అయితే ఆమెకు తొలి చిత్రం పెద్దగా పేరు తేలేదనే చెప్పాలి. 'పోటుగాడు' సినిమాలో సాక్షి చౌదరి పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఆమెను కేవలం పాటల్లో అందాలు ఆరబోసేందుకే ఉపయోగించుకున్నారు.

దీంతో సినిమా అవకాశాలు దక్కించుకోవడానికి సాక్షి చౌదరి తన హాట్ అండ్ సెక్సీ అందాలతో ఫిల్మ్ మేకర్స్‌ను ఆకర్షించే ప్రతయ్నం చేస్తోంది. ఇందులో భాగంగా చిట్టి పొట్టి డ్రెస్సుల్లో ఫోటో షూట్లలో పాల్గొంటోంది. తాజాగా విడుదలైన సాక్షి చౌదరి హాట్ ఫోటోలు....ఫిల్మ్ మేకర్స్‌ను టెమ్ట్ చేస్తున్నాయో లేదో తెలియదు కానీ....సినీ జనాలను మాత్రం టెమ్ట్ చేస్తున్నాయి.

స్లైడ్ షోలో సాక్షి చౌదరి హాట్ ఫోటోలతో పాటు, ఇతర వివరాలు వివరాలపై ఓ లుక్కేద్దాం....

పోటుగాడు హిట్

పోటుగాడు హిట్


రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై మంచు మనోజ్‌ హీరోగా 'పోటుగాడు' చిత్రాన్ని తెరరెక్కించారు. పవన్‌ వడయార్ దర్శకత్వం వహించిన చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధించింది. మనోజ్ కెరీర్లో ఇదొక హిట్ చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది.

గోవిందాయ నమ: రీమేక్

గోవిందాయ నమ: రీమేక్


పోటుగాడు చిత్రం ఓ కన్నడ రీమేక్. కోమల్ హీరోగా వచ్చిన 'గోవిందాయ నమ:'.. చిత్రం తెలుగులో 'పోటుగాడు' గా తెరకెక్కించారు. కన్నడంలో దర్శకత్వం చేసిన పవన్‌ ఈ చిత్రానికి సైతం దర్శకత్వం వహించారు. అలాగే 'పోటుగాడు' చిత్రాన్ని తమిళంలో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో నిర్మించనున్నారు. ‘పోటుగాడు' చిత్రంలో మంచు మనోజ్‌తో కలిసి ఓ పాటను పాడారు శింబు. ఈ పాట హిట్ అవ్వడం వల్లనే సినిమాపై అంచనాలు పెరిగి మంచి ఓపెనింగ్స్ సాధించింది.

సాక్షితో సహా నలుగురు హీరోయిన్లు

సాక్షితో సహా నలుగురు హీరోయిన్లు


నలుగురు హీరోయిన్లు సాక్షీ చౌదరి, సల్మాన్‌కౌర్ ముండి, రేచెల్ వియిస్, అనూ ప్రియా హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో పోసాని కృష్ణమురళి, అలీ, షాయాజీ షిండే, రఘుబాబు, చంద్రమోహన్, కె. ధన్‌రాజ్, వై.శ్రీనివాస్‌రెడ్డి, కె.శివశంకర్, గీతాసింగ్, సత్యం రాజేష్ తదితరులు నటించారు.

కలెక్షన్లు అదిరాయి

కలెక్షన్లు అదిరాయి


సాధారణంగా మనోజ్ చిత్రం వంద రోజుల్లో సాధించే రెవిన్యూని ‘పోటుగాడు' చిత్రం మొదటి రెండు రోజుల్లోనే సాధించిందని, తమ బ్యానర్ లో వచ్చిన ఎవడి గోల వారిదే చిత్రం 175 కి సాధించిన మొత్తం కూడా రెండు రోజుల్లోనే క్రాస్ చేసిందని చెప్పారు నిర్మాత.

శ్రీధర్ లగడపాటి

శ్రీధర్ లగడపాటి


నిర్మాత శ్రీధర్ మాట్లాడుతూ- కథని, నటీనటులని నమ్మి తాను ‘పోటుగాడు' చిత్రం నిర్మించానని, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్లు చక్కని పథకంతో విడుదల చేశారని, దీంతో సినిమా హిట్టయి తమ సంస్థకు మంచి పేరు తెచ్చిందని, అదేవిధంగా తమ అందరి నమ్మకాలు కూడా నిజమైనందుకు ఆనందంగా ఉందని, ఓ రకంగా పోటుగాడు అన్ని కేంద్రాలలో అదరగొడుతున్నాడని తెలిపారు.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్


సాంకేతిక విభాగం ఈ చిత్రానికి సంగీతం: అచ్చు, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, మాటలు: శ్రీధర్ శీపన, పాటలు: రామజోగయ్య శాస్ర్తీ, కందికొండ, ఎస్. ఎ.కె. బాసా, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, నిర్మాతలు: శిరీషా-శ్రీ్ధర్, రచనా, దర్శకత్వం: పవన్ వడయార్.

English summary
Potugadu actress Sakshi Chowdary hot photos. Potugadu is a Telugu film directed by Pavan Wadeyar. It is a remake of the Kannada film Govindaya Namaha which was also directed by Pavan Wadeyar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu