ప్రభాస్-ప్రభుదేవా పౌర్ణమి కౌంట్‌డౌన్
ప్రభాస్-ప్రభుదేవా కాంబినేషన్‌లో ఎంఎస్ రాజు నిర్మించిన పౌర్ణమి సినిమా ప్రస్తుతం ఫైనల్ మిక్సింగ్‌లో ఉంది. ఈ సినిమా ఈనెల 20న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. గతంలో తనకు హిట్స్ ఇచ్చిన వారిని మర్చిపోని నైజం గల ఎంఎస్ రాజు ఈ సినిమాలో తన పాత టీం మెంబర్లయిన ప్రభాస్, త్రిష, ప్రభుదేవా, దేవిశ్రీ ప్రసాద్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి తదితరులను తీసుకున్నారు. ఈ వేసవిలో విడుదల అవుతున్న నాలుగు భారీ సినిమాల్లో ఇదొకటి. ఈ సినిమాలో చార్మి, సింధు తులానీ, మధుశర్మ కూడా నటించడం విశేషం. ఇంత మంది హీరోయిన్లను కథలో ఎలా ఎకామడేట్ చేశారన్నది సస్పెన్స్‌గా ఉంది. ఈ సినిమా పాటలు బాగున్నాయన్న పేరు ఇప్పటికే వచ్చింది. ఆ పాటలకు ప్రభుదేవా సమకూర్చిన కొరియోగ్రఫీ సహజంగానే అద్భుతమని టీవీ యాడ్స్ చూస్తే తెలుస్తోంది. సాంకేతికంగా ఈ సినిమా గొప్పగా ఉంటుందనడంలో సందేహం లేదు కానీ కథ ఎలా వచ్చిందన్న దాని మీద సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.


Click it and Unblock the Notifications











