Pawan Kalyan Insta Post: అలీ, మోహన్ బాబును పట్టించుకోని పవర్ స్టార్.. కారణం అదేనా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్... ఓవైపు రాజకీయాల్లో బిజి బిజిగా గడుపుతూ.. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నారు. రీసెంట్ గా ఆయన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నిన్న ఓ వీడియోను పోస్ట్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక అందులో సినీ పరిశ్రమలోని వారితో గతంలో తాను దిగిన ఫొటోలను ఓ అందమైన వీడియోగా పవన్ పోస్ట్ చేశారు. పవన్ స్టార్ అపూర్వమైన జ్ఞాపకాలు ఈ వీడియోలో ఉన్నాయి. కానీ ఆ వీడియోలో ఇద్దరు బడా స్టార్లను పవన్ మిస్ అయ్యాడు. వివరాళ్లోకి వెళితే..
2.4మిలియన్స్ ఫాలోవర్స్...: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల ఇన్‍స్టాగ్రామ్‍లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. జూలై 4వ తేదీ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయగా... అకౌంట్ క్రియేట్ అయిన గంటల్లోనే మిలియిన్ ఫాలోవర్లు వచ్చారు. ఒక్క పోస్ట్ పెట్టకుండానే పవన్ ఇన్‍స్టా అకౌంట్‍కు ఇప్పటి వరకు 2.4 మిలియన్ ఫాలోవర్లు అయ్యారు. అయితే పవన్ కల్యాణ్ ఎప్పడెప్పుడు ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ పెడతారా అని అందరూ ఎదురు చూశారు. అయితే నిన్న పవన్ ఫస్ట్ ఇస్టా పోస్ట్ చేశారు.

పవన్ తొలి పోస్ట్...: పవన్ కల్యాణ్ ఇన్ స్టాగ్రామ్‍లో తొలి పోస్ట్ పెట్టాడు. సినీ పరిశ్రమలోని వారితో గతంలో తాను దిగిన ఫొటోలను ఓ అందమైన వీడియోగా పవన్ పోస్ట్ చేశారు. పవన్ స్టార్ అపూర్వమైన జ్ఞాపకాలు ఈ వీడియోలో ఉన్నాయి. చిన్న నటులు, నిర్మాతలు, దర్శకుల నుంచి దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులతో దిగిన ఫొటోలన్నింటినీ ఒకే చోట జోడిస్తూ ఓ ప్రత్యేకమైన వీడియోను పోస్ట్ చేశారు.

వీడియోలో ఎవరెవరు ఉన్నారంటే...: ఈ వీడియోలో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్, అమితాబ్ బచ్చన్, మహేశ్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, హరికృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ, రవితేజ, సమంత, ఇలియానా, సాయితేజ్, దర్శకులు రాఘవేంద్రరావు, రేణుదేశాయ్, దాసరి సత్యనారాయణ, రాజమౌళి, హరీశ్ శంకర్, పూరి జగన్నాథ్, మ్యూజిక్ డైరెక్టర్స్ అనిరూధ్, తమన్, మణిశర్మ, కమెడియన్స్ బ్రహ్మానందం, హైపర్ ఆది, సునీల్, వేణు నిర్మాతలు సురేశ్ బాబు, బోణీకపూర్ తో దిగిన ఫొటోలను పోస్ట్ చేశారు. ఇక వీడియో చివర్లో విక్రమ్, విజయ్ దళపతి, కార్తితో దిగిన ఫొటోలతో ముగించారు.

ఇద్దరు స్టార్స్ మిస్...: ఇదిలా ఉంటే.. ఈ వీడియోలో ఇద్దరు స్టార్స్ మిస్ అయ్యారు. పవన్ కల్యాణ్ తో ఎన్నో సినిమాల్లో నటించిన యాక్టర్ అలీ, మంచు మోహన్ బాబు. వీరు ఇద్దరు ఈ వీడియోలో మిస్ అయ్యారు. గతంలో అలీ, పవన్ క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలిసిందే. అయితే వీరి మధ్య విభేదాలు వచ్చాయని ప్రచారం కూడా సాగుతోంది. ఇక ఈ నేపథ్యంలో ఆయన ఫోటో లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇక అలీ ప్రస్తుతం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే.
హాట్ టాపిక్ గా...:మరోవైపు మోహన్ బాబు ఫోటో కూడా లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది. మంచు కుటుంబానికి, మెగా కుటుంబానికి పడదు అనే ప్రచారం అయితే ఎప్పటి నుంచో ఉంది. పవన్ ఇన్ స్టా ఫస్ట్ పోస్టులో మోహన్ బాబు లేకపోడవంతో.. ఇది బలపరిచినట్లు అయ్యింది. ఇక పవన్ కల్యాణ్.. అలీ, మోహన్ బాబును పట్టించుకోకపోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











