రవితేజ ‘పవర్’ ఆడియో ట్రాక్ లిస్ట్
హైదరాబాద్: మాస్ మహారాజ రవితేజ హీరోగా రాకలైన్ ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి పతాకంపై కె.ఎస్.రవీంద్రనాథ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టెనర్ 'పవర్'. రవితేజ సరసన హన్సిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి, ముఖేష్ రిషి, రావు రమేష్, మిర్చి సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖా వాణి, జోగి బ్రదర్స్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు.
థమన్ సంగీతం అందించారు. ఆగస్టు 10న ఆడియో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శిల్పకళా వేదికలో గ్రాండ్ గా ఆడియో ఫంక్షన్ ప్లాన్ చేసారు. తాజాగా ఆడియో ట్రాక్ లిస్ట్ విడుదలైంది.

1. దేవుడా దేవుడా
2. బద్మాషు పిల్లా
3. నోటంకి
4. చంపేసిందే
5. నువ్వు నేను
ఈ చిత్రానికి సంగీతం : ఎస్ఎస్. థమన్, ఫోటోగ్రఫీ: ఆర్థర్ ఎ. విల్సన్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటర్: గౌతం రాజు, మాటలు : కోన వెంకట్, స్ర్కీన్ ప్లే: కె. చక్రవర్తి, మోహన్ కృష్ణ, కో డైరెక్టర్: నందగోపాల్ కురుళ్ల, ప్రొడక్షన్ కంట్రలర్: పి.ఎ.కుమార్ వర్మ, నిర్మాత: రాక్ లైన్ వెంకటేష్, కథ-దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాథ్(బాబి).


Click it and Unblock the Notifications











