టీజర్ ఇనిస్టెంట్ గా హిట్టైంది (వీడియో)
హైదరాబాద్ : రవితేజ హీరోగా రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవీంద్రనాథ్ దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్ రూపొందిస్తున్న చిత్రం 'పవర్'. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కొత్త టీజర్ ని విడుదల చేశారు. యాక్షన్ నేపధ్యంతో విడుదలైన ఈ టీజర్ ఇప్పుడు అంతటా క్రేజ్ క్రియేట్ చేస్తోంది.
<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/8aHPyRjLOuw" frameborder="0" allowfullscreen></iframe></center>
నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ మాట్లాడుతూ.... తనకున్న పవర్‌ని ఆయుధంగా చేసుకుని పోరాటం చేసిన ఓ పోలీస్ ఆఫీసర్ కథే ఈ చిత్రమని, పవర్ అనే టైటిల్ ఖచ్చితంగా ఆయనకు యాప్ట్ అవుతుందని తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ... పవర్ అంటే ఇంటికొచ్చే కరెంటు కాదు. బయట చేసే రాజకీయం కాదు. అది ఒంట్లో ఉండాలి.. అలాంటి హీరోని మా చిత్రంలో చూడొచ్చు అన్నారు. ఇటీవల బ్యాంకాక్‌లో యాక్షన్ సన్నివేశాల్ని తెరకెక్కించాం. బుధవారం నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో రవితేజ, హన్సికలపై ఓ పాటని చిత్రీకరిస్తాం. దాంతో షూటింగ్ పూర్తవుతుంది అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ''పవర్ ఫుల్ పోలీస్ కథ ఇది. పేరుకు తగ్గట్టుగానే ప్రతీ సన్నివేశం శక్తిమంతంగా ఉంటుంది. రవితేజ సినిమా నుంచి ఎలాంటి అంశాలు ఆశిస్తారో.. అవన్నీ మేళవించి ఓ రంగుల హరివిల్లులా తీర్చిదిద్దాం. ఈనెల 29న 'పవర్'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.
రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి) దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హన్సిక తొలిసారిగా రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, ముఖేష్ రుషి, రావూ రమేష్, సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖావాణి, జోగి బ్రదర్స్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్.తమన్, కెమెరా:ఆర్థర్ ఎ.విల్సన్, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, మాటలు:కోన వెంకట్, నిర్మాత:రాక్‌లైన్ వెంకటేష్, కథ, దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి).


Click it and Unblock the Notifications











