పవర్: సంబరాల్లో రవితేజ, హన్సిక (ఫోటోలు)
హైదరాబాద్: రవితేజ, హన్సిక, రెజీనా హీరో హీరోయిన్లుగా తెరకెక్కించిన ‘పవర్' చిత్రం శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా ఫీడ్ బ్యాక్ ఆశాజనకంగా ఉండటంతో పవర్ టీం సంబరాలు చేసుకున్నారు. రవితేజ, హన్సిక, దర్శకుడు బాబీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
‘పవర్' సినిమా స్టోరీ పరంగా కొత్తదనం లేక పోయినా... ఇప్పటికే వచ్చిన సినిమాల స్టోరీలను కలిపి ఈ చిత్రం స్టోరీ రెడీ చేసుకున్నట్లు అనిపించినా......కామెడీ, యాక్షన్ కలగలిపి వినోదాత్మకంగా చిత్రాన్ని తెరకెక్కించడం సినిమా కలిసొస్తోంది. సినిమాకు వెళ్లిన ప్రేక్షకుల నుండి ఫర్వాలేదనే ఫీడ్ బ్యాక్ వస్తుండటంతో దర్శక నిర్మాతలు ఆనందంగా ఉన్నారు.
స్లైడ్ షోలో ‘పవర్' సంబరాలకు సంబంధించిన ఫోటోలు...

కంగ్రాజ్యులేషన్స్ పవర్ టీం
కంగ్రాజ్యులేషన్స్ పవర్ టీం అని రాసి ఉన్న కేక్ కట్ చేస్తున్న హన్సిక, రవితేజ.

రవితేజ, హన్సిక హ్యాపీ
సినిమా విడుదల తర్వాత రవితేజ, హన్సిక మొహంలో హ్యాపీనెస్ కనిపించింది.

నటీనటులు
ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ముఖేష్ రిషి, సంపత్ రాజ్, అజయ్, సురేఖావాణి, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మాజీ, జీవా, సుబ్బరాజు, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, జయలక్ష్మి, వినయ్ ప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

సాంకేతిక విభాగం
ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్. థమన్, సినిమాటోగ్రఫీ: జయనన్ విన్సెంట్, మనోజ్ పరమహంస, ఎడిటింగ్: గౌతం రాజు, స్క్రీన్ ప్లే: కె. చక్రవర్తి, మోహన్ కృష్ణ, ఆర్ట్: బ్రహ్మకడలి, మాటలు: కోన వెంకట్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జె.బి.కృష్ణ, చీఫ్ కోడైరెక్టర్: ఎస్.సురేష్ కుమార్, నిర్మాత: రాక్ లైన్ వెంకటేష్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: కె.ఎస్.రవీంద్ర(బాబీ).


Click it and Unblock the Notifications











