ఇరగదీసాడు: ‘పవర్’ థియేట్రికల్ ట్రైలర్ (వీడియో)
హైదరాబాద్: మాస్ మహరాజా రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'పవర్' మూవీ సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రావడానికి సిద్దమవుతోంది. తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ అదరిపోయే విధంగా ఉంది. అటు యాక్షన్, ఇటు కామెడీ, మరో వైపు రొమాన్స్...ఇలా అన్ని విధాలుగా రవితేజ ఇరగదీసాడు.

బ్రహ్మానందం, రవితేజ మధ్య వచ్చే కామెడీ....హీరోయిన్లు హన్సిక, రెజీనాతో రొమాంటిక్ సీన్లు ట్రైలర్లో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. అదే విధంగా విలన్లను మట్టికరిపించడంలో తన పవర్ ఏమిటో చూపించాడు. ఇవన్నీ మేము చెప్పడం కన్నా...మీరు ట్రైలర్లో చూడటమే కిక్ ఇస్తుంది. క్రింద ఉన్న ట్రైలర్‌పై ఓ లుక్కేయండి.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/d_XWXeQzylM?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>
ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ముఖేష్ రిషి, సంపత్ రాజ్, అజయ్, సురేఖావాణి, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మాజీ, జీవా, సుబ్బరాజు, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, జయలక్ష్మి, వినయ్ ప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్. థమన్, సినిమాటోగ్రఫీ: జయనన్ విన్సెంట్, మనోజ్ పరమహంస, ఎడిటింగ్: గౌతం రాజు, స్క్రీన్ ప్లే: కె. చక్రవర్తి, మోహన్ కృష్ణ, ఆర్ట్: బ్రహ్మకడలి, మాటలు: కోన వెంకట్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జె.బి.కృష్ణ, చీఫ్ కోడైరెక్టర్: ఎస్.సురేష్ కుమార్, నిర్మాత: రాక్ లైన్ వెంకటేష్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: కె.ఎస్.రవీంద్ర(బాబీ).


Click it and Unblock the Notifications











