లొకేషన్లోనే రాజమౌళి వైఫ్ కునుకు..!(ఫోటో)
హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం 'బాహుబలి' అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కేరళలో జరుగుతోంది. ఈ చిత్రానికి రాజమౌళి భార్య రమ స్టైలిస్ట్‌గా పని చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన పనుల్లో ఎప్పుడూ బిజీగా ఉండే ఆమె లొకేషన్లోనే కునుకు తీసారు. అదే విధంగా ఈచిత్రానికి కళా దర్శకుడిగా పని చేస్తున్న సాబు సిరిల్ కూడా పని మధ్యలో అలసి పోయి నడుము వాల్చారు. అందుకు సంబంధించిన ఫోటోను ఇక్కడ చూడొచ్చు.
ప్రస్తుతం 'బాహుబలి' షూటింగ్ కేరళలో జరుగుతోంది. ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.
దర్శకుడు రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చేయని విధంగా 'బాహుబలి' యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రధాన తారాగణంతో పాటు దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించేందుకు ప్లాన్ చేసారు. ఈ మేరకు వారికి కత్తియుద్ధం, గుర్రపుస్వారీలో శిక్షణ ఇచ్చారు.
పీటర్ హెయిన్స్ ఈ యుద్ద సన్నివేశాలకు యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. డిసెంబర్లో ప్రారంభం అయ్యే ఈ షూటింగ్ రెండు నెలల పాటు ఫిబ్రవరి నెల వరకు సాగుతుందని తెలుస్తోంది. త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం బాహుబలి సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. డిసెంబర్ 3న కేరళ షెడ్యూల్ పూర్తి కానుంది.


Click it and Unblock the Notifications












