HBD Pawan Kalyan : డిప్యూటీ సీఎం అయ్యాకా అలా.. ఆనంద్ సాయి షాకింగ్ కామెంట్స్, బయటపడే రకం కాదంటూ

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. గత కొన్నేళ్లుగా జరుపుకోవడం వేరు. ఈ ఏడాది వేరు. 2024 సంవత్సరం పవన్ కళ్యాణ్ జీవితంలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. పదేళ్ల పోరాటం ఫలించి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించి పాలకుడిగా తన మార్క్ చూపిస్తున్నారు. అయితే నటుడిగా, రాజకీయ నాయకుడిగా , పాలకుడిగా పవన్‌లో ఏమైనా మార్పులు వచ్చాయా అన్నదానిపై ఆయన బెస్ట్ ఫ్రెండ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

పవన్ కళ్యాణ్ చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటారు. సినిమాలు లేకుంటే తన ఫామ్ హౌస్‌లో ప్రకృతితో మమేకం కావడం ఆయనకు అలవాటు. ఫ్రెండ్స్ కూడా తక్కువే, తీరిక దొరికితే పుస్తకాలు చదువుకుంటారు. పవన్ కళ్యాణ్‌కు చిత్ర పరిశ్రమలో ఉన్న అతికొద్దిమంది మిత్రుల్లో ఆనంద్ సాయి ఒకరు. పవన్ కళ్యాణే తనను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చాడని, ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టడని తన మిత్రుడి గురించి గొప్పగా చెబుతారు సాయి. పవన్ బెడ్‌పై తాను పడుకుంటే, ఆయన నేల మీద పడుకునేవారని పెద్ద స్టార్ హీరోనని, చిరంజీవి తమ్ముడిననే గర్వం ఆయనలో కనిపించదని ఆనంద్ సాయి తెలిపారు.

power star best friend Art Director Anand Sai about changes in pawan kalyan as deputy cm of ap here s the details

అన్నయ్య పెద్ద స్టార్ హీరో అయ్యుండి కూడా.. తాను కష్టపడి పైకి రావాలి , తనకంటూ స్టైల్ ఉండాలని పవన్ భావించే వారని గుర్తుచేసుకున్నారు. సినిమాల్లోకి రావాలంటే ఎవరైనా డ్యాన్స్‌లు నేర్చుకుంటారని, కానీ కళ్యాణ్ కరాటేలో జాయిన్ అయ్యి దెబ్బలు తిన్నాడని ఆయనలోని కసిని వివరించారు. ఇన్నేళ్ల జర్నీలో మా ఇద్దరి మధ్యా గొడవలు, మనస్పర్ధలు రాలేదని.. నేను షూటింగ్ స్పాట్‌కెళ్లి డిస్ట్రబ్ చేయనని.. ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేస్తే కలుస్తామని ఆనంద్ సాయి పలు సందర్భాల్లో చెప్పారు.

పవన్ కళ్యాణ్ బర్త్ డే నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనంద్ సాయి కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్‌తో ఉన్న మూడు దశాబ్ధాలకు పైగా ఫ్రెండ్‌షిప్‌లో ఒకటి రెండు సార్లు మాత్రమే ఆయన పుట్టినరోజులకు విష్ చేసి కేక్ కట్ చేశానని చెప్పారు. పవన్‌తో ఫ్రెండ్‌షిప్ వల్ల బర్త్ డేలపై తనకూ ఇంట్రెస్ట్ ఉండేది కాదని, మూవీ సక్సెస్ అయినప్పుడు కూడా సెలబ్రేషన్స్ ఉండేవి కావని ఆనంద్ సాయి తెలిపారు. సక్సెస్ ఒక్కచోటే ఆగిపోకూడదని.. అది కంటిన్యూ అవ్వాలనేది పవన్ సిద్ధాంతమని చెప్పారు.

ఫ్యూచర్ గురించి పవన్ కళ్యాణ్‌కి ఖచ్చితమైన ప్లాన్ ఉందన్నారు. పవన్ ప్రజల మనిషి కాబట్టి.. ప్రజలే ఆయన పుట్టినరోజుని సెలబ్రెట్ చేస్తారని ఆనంద్ సాయి తెలిపారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్‌లో ఏమైనా మార్పులు వచ్చాయా అని యాంకర్ ప్రశ్నించగా.. డిప్యూటీ సీఎం పొజిషన్‌ని కరెక్ట్ హ్యాండిల్ చేయాలనే తపనలోనే పవన్ ఉన్నారని ఆయన వెల్లడించారు. ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించిన సమయంలో తాను పవన్ పక్కనే ఉన్నానని, ఆయనలో ఏ డిఫరెన్స్ కనిపించలేదని ఆనంద్ సాయి పేర్కొన్నారు. తనతో ఏనాడు పవన్ కళ్యాణ్ రాజకీయాలు మాట్లాడలేదని, బాధైనా, సంతోషమైనా తనలోనే దాచుకుంటాడు కానీ బయటపడడని వెల్లడించారు. ప్రస్తుతం ఆనంద్ సాయి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: anand sai pawan kalyan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X