పవన్ ఫ్యాన్స్‌తో షూటింగ్ వాయిదా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో అభిమానులతో కలిసి కొన్ని సీన్లు చిత్రీకరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ షూటింగును వాయిదా వేశారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు.
పవన్ వారి అభిమానులతో కలిసి నడుస్తూ ఉన్నట్టు సన్నివేశం చిత్రీకరించాల్సి ఉండగా... వాతావరణం బాగాలేని కారణంగా ఈ చిత్రీకరణకి అంతరాయం కలిగింది. దీంతో ఈ సన్నివేశ చిత్రీకరణ తేది వాయిదా పడింది అని త్వరలో తేదిని ప్రకటిస్తాం అని పూరి జగన్నాథ్ తెలిపారు.
పవన్, తమన్నా జంటగా నటిస్తున్న ఈచిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. పవన్ ఇందులో మెకానిక్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. తమన్నా జర్నలిస్టు పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల అవుతుంది.
ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి ఇప్పటి వరకు ముఖ్య తారాగణంగా ఎంపికైన వారిలో ఉన్నారు. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సంగీతం : మణిశర్మ, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











