అభిమానం: పవన్ కళ్యాణ్ విగ్రహం పెడుతున్నారు!(ఫోటోస్)
హైదరాబాద్: సినిమా తారలపై అభిమానం ఫ్యాన్స్ వివిధ రూపాల్లో చూపిస్తూ ఉంటారు. కొందరు తమ అభిమాన తారలకు గుడి కడుతుంటారు. విగ్రహాలు పెడుతుంటారు. ఇంకా అనేక సేవకార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా మరో అడుగు ముందుకేసి ఆయనకు విగ్రహం పెడుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలలోని పెనుమంట్ర మండలం తాడేపల్లి రహదారిపై హీరో పవన్‌కళ్యాణ్ విగ్రహావిష్కరణకు అభిమానులు సన్నాహాలు చేపట్టారు. అందుకోసం రూ.2 లక్షల వ్యయంతో పవన్ విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహాన్ని తాడేపల్లి గూడెంకు చెందిన డాక్టర్ అరుణ్ ప్రసాద్ ఉడియార్, కరుణాకర్ ఉడియార్ రూపకల్పన చేశారు. విగ్రహావిష్కరణకు ఆహ్వానించేందుకు వచ్చే వారం పవన్ కళ్యాణ్‌ను అభిమానులు కలువనున్నారు.
స్లైడ్ షోలో విగ్రహానికి సంబంధించిన ఫోటోలు, వివరాలు...

అదీ సంగతి
అసలు పవన్ కళ్యాణ్‌కు పబ్లిసిటీ, పొగడ్తలు అంటే నచ్చదు. అలాంటి వ్యక్తి తన విగ్రహం పెడుతున్నారంటే ఎలా స్పందిస్తారో?

భిన్నమైన వ్యక్తి
ఆయనది భిన్నమైన వ్యక్తితత్వం. సహాయ గుణం కలిగిన తత్వం. సేవ చేయడం, సహాయం చేయడమే తప్ప దాని గురించి బయటకు చెప్పుకోవడం ఇష్టం ఉండదు. అలాంటి వ్యక్తి తనకు విగ్రహం పెడుతున్నారంటే ఎలా స్పందిస్తారు అనేది చర్చనీయాంశం అయింది.

చేతిలో ఇజం బుక్
పవన్ కళ్యాణ్ జన సే పార్టీ పెట్టిన సమయంలో ఎలాంటి గెటప్‌లో ఉన్నాడో...అలాంటి గెటప్ లో ఈ విగ్రహం తయారు చేయించారు. విగ్రహం చేతిలో కూడా ఇజం బుక్ ఉండటం గమనార్హం. ఈ విగ్రహం వల్ల పవన్ కళ్యాణ్ బాటలో నడిచే వారు, ఆయన్ను ఫాలో అయ్యే వారు పెరుగుతారని విగ్రహం ఏర్పాటు చేస్తున్న వారు భావిస్తున్నారేమో!

సినిమాల విషయానికొస్తే..
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘గోపాలా గోపాలా' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఈ రోజే విడుదలైంది.


Click it and Unblock the Notifications











