పవర్ స్టార్ పవన్ ' హెల్త్ కార్డు'... డిటేల్స్
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ డిసెంబర్ 1న తిరుపతిలో ''పవన్ ప్రాణదాత హెల్త్ కార్డ్ ''ని ప్రారంభించనున్నారని సమాచారం . తిరుపతిలో అశేష అభిమానుల కోసం ఈ కొత్త రకం హెల్త్ కార్డ్ ప్రారంభించనున్నారు. తరతరాల కోసం సంపాదిస్తే రెండవ తరానికి గుర్తుండమని ..... ఈ తరానికి ఏదైనా చేద్దామని అన్న పవన్ కళ్యాణ్ మాటలను స్పూర్తిగా తీసుకొని తిరుపతి అభిమానులు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్తున్నారు. దానికి తమ అభిమాన హీరో పేరు పెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ హెల్త్ కార్డ్ డిసెంబర్ 1నుండి అమలులోకి రానుందని చెంప్తున్నారు.

ఇక పవన్ ‘గోపాల గోపాల' విషయానికి వస్తే...
హిందీలో విజయవంతమైన ‘ ఓ మైగాడ్ ' చిత్రాన్ని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్‌గా తెలుగులో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ గోపాల గోపాల '. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్ మోషన్ పోస్ట్‌ర్‌ను విడుదల చేశారు. పవన్ అభిమానులంతా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పోస్టర్ రానే వచ్చింది.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మోడ్రన్ కృష్ణుడి పాత్రలో కనిపిస్తున్నాడు. ఊయలలో ఊగుతున్న కృష్ణుడిలా ఉన్న పవన్‌ను వెంకటేష్ అనుకరించడం ఈ పోస్టర్‌లోని విశేషం. కిషోర్ పార్థసాని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి అనుప్‌రూబెన్స్ స్వరాలు అందిస్తున్నారు. డి.సురేష్‌బాబు, శరత్ మరారీ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మధుశాలిని, దీక్షాపంత్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉండటంతో చిత్రీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. అందరి ఊహగానాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం ఉంటుందని ఫిలింనగర్‌లో టాక్ వినబడుతోంది. కిషోర్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి డి.సురేష్‌బాబు, శరత్ మారార్‌లు కలిసి నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











