గబ్బర్ సింగ్ కూడా అదే ఇంట్లోకి...
మర్యాదరామన్న సినిమా కోసం కోకాపేటలో రాయలసీమ సాంప్రదాయంలో ఓ ఇంటి సెట్ వేసిన సంగతి తెలిసిందే. ఆ ఇల్లు సెట్ సినిమాకే హైలెట్ గా నిలవడంతో ఇతర సినిమాల హీరోలు, దర్శకులు కూడా అదే ఇంట్లో షూటింగ్ జరుపుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మర్యాదరామన్న చిత్రం హిట్ అవ్వడంతో ఆ సెంటిమెంటు పని చేస్తుందని భావిస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో 'రెబెల్' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆ మధ్య మర్యాద రామన్న ఇంట్లో కొన్ని సీన్ల చిత్రీకరణ జరుపుకుంది.
తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న 'గబ్బర్ సింగ్' చిత్రం కూడా ఇంట్లో షూటింగ్ జరుపుకుంటోంది. మంగళవారం నుంచి కొన్ని ప్యాచ్ వర్క్ సీన్లు ఇక్కడ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో శృతి హాసన్ నాయిక. బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 7న చిత్రం ఆడియోను విడుదల చేసింది. మే 9న గ్రాండ్ గా 1800 పైచిలుకు థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు.


Click it and Unblock the Notifications











