పంజా ఫస్టాఫ్ ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్...!
పవన్ కళ్యాణ్ హీరోగా విష్ణవర్థన్ డైరెక్ష్న్ లో తెరకెక్కిన పంజా చిత్రం ఈ రోజు (9.12.11)ప్రపంచవ్యాప్తంగా సుమారు 1800థియేటర్లలో విడుదలైంది. ఇప్పటి వరకు మాకు అందిన సమాచారం ప్రకారం సినిమా ఫస్టాఫ్ అంతా చాలా స్టైలిష్ గా తెరకెక్కిందని తెలిసింది. తన ప్రతి చిత్రంలో వేలెట్టే పవన్ కళ్యాణ్...ఈ చిత్రం ఫస్టాఫ్ వరకు ఎటువంటి ఎక్స్ స్ట్రాలు చేయకుండా చాలా నాచురల్ గా నటించాడని తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటి వరకు పవన్ నటించిన చిత్రాలకు భిన్నంగా పవన్ నటన సాగినట్లుగా సమాచారం. ఫస్టాఫ్ హైలెట్స్
1. పవన్ కళ్యాణ్ స్టయిలిష్ యాక్టింగ్
2. అద్దిరిపోయే ఫోటోగ్రఫీ
3. సాంగ్స్ పిక్ఛరైజేషన్
4. విలన్ అడవి శేషు యాక్టింగ్
మొదట్లో 20నిమిషాల సినిమా మినహా ఫస్టాఫ్ అంతా అభిమానులు ఎక్స్ పెక్ట్ చేసిన రేంజ్ లో ఉన్నట్లుగా సమాచారం. అలాగే చిత్రానికి ఇంటర్వెల్ పెద్ద హైలెట్ అని తెలిసింది. ఎటువంటి ప్లాష్ బ్యాక్ లు లేకుండా చక్కని ఇంటెర్వెల్ తో విష్ణువర్థన్ స్టయిలిష్ డైరెక్షన్ సినిమా సెకండాఫ్ పై ఆసక్తిని పెంచే విధంగా ఉన్నట్లు సమాచారం. అలాగే ఇంటర్వెల్ లో చనిపోయే అడివి శేషు సూపర్బ్ నటన ప్రదర్శించినట్లుగా సమాచారం. ఫస్టాఫ్ వరకు చిత్ర రిజల్ట్ ప్రకారం ఇన్నాళ్లు వేచి చూసిన పవన్ అభిమానుల పంట పండినట్లే అని ఎక్స్ క్లూజివ్ సమాచారం.


Click it and Unblock the Notifications











