రెండు రోజుల ముందే యూత్ లో 'పంజా' మానియా మొదలైందహో.....!
టాలీవుడ్ అంతా ఇప్పుడు పవన్ కల్యాణ్ తాజా సినిమా 'పంజా' వైపే చూస్తోంది. 'పంజా' భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 9న విడుదలవుతున్న ఈ చిత్రం ఫలితం ఎలా ఉంటుందన్న విషయంపై డిస్కషన్స్ జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ సారి బాక్స్ ఆఫీసు దగ్గర విజయం సాధిస్తాడని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కలకత్తా నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ పంజా చిత్రంలో అడివి శేష్, జాకీష్రాఫ్ మెయిన్ విలన్స్ గా నటించారు.
విశ్వనీయ వర్గాల సమాచారం ప్రకారం డైరెక్టర్ విష్ణు వర్ధన్ పంజా అధ్బుతంగా తీర్చిదిద్దారని పవన్ కళ్యాణ్ బ్రహ్మానందం కామెడీ బాగా పండినదని సమాచారం. సారా జేన్ డియాస్, అంజలి లవనియా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ, నగేష్ ముంత సంయుక్తగా నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా అందించిన పాటలు ఆల్రెడీ మార్కెట్లో విజయం సాధించాయి.
ఇదిలా ఉంచితే, ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 1800 థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ జరుగుతోంది. అలాగే, మొదటి రోజే రికార్డు కలక్షన్లు వసూలు చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారు. అందుకే, అత్యధిక మొత్తంలో స్క్రీన్స్ వాడుతున్నారు. మామూలుగా స్టార్ హీరోల సినిమాలకు ఎలాగూ మంచి ఓపెనింగ్స్ వుంటాయి. ఇది పవన్ కల్యాణ్ సినిమా కావడంతో మరింతగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. సినిమాలో విషయం వుంటే కనుక, పవన్ ఇమేజ్ తోడై పెద్ద హిట్ అయ్యే అవకాశం వుంది. ఏమైనా, ఇక రెండు రోజుల్లో ఫలితం తేలిపోతుంది. అంతవరకూ సస్పెన్సే!


Click it and Unblock the Notifications











