twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాలీవుడ్‌లో అజ్ఞాతవాసి హంగామా! .. బ్యానర్లతో ఫ్యాన్ హల్‌చల్

    By Rajababu
    |

    Recommended Video

    హాలీవుడ్‌లో అజ్ఞాతవాసి హంగామా !

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం దేశంలోనే కాదు.. ఓవర్సీస్‌లో కూడా హల్‌చల్ చేస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ఫీవర్ అమెరికాను ఊపేస్తున్నది. యూఎస్‌లోని పవన్ అభిమానులు ప్రఖ్యాత హాలీవుడ్ స్టూడియో వద్ద హంగామా చేశారు. అది మీరే చూడండి..

    హాలీవుడ్ స్టూడియో వద్ద అజ్ఞాతవాసి

    హాలీవుడ్ స్టూడియో వద్ద అజ్ఞాతవాసి

    అజ్ఞాతవాసి చిత్రం రిలీజ్ అవుతున్న సందర్భంగా లాస్ ఎంజెలెస్‌లోని హాలీవుడ్ స్టూడియో వద్ద ఫ్యాన్స్ పండుగ చేసుకొన్నారు. హాలీవుడ్ స్టూడియోకు సమీపంలో బ్యానర్లు, హోర్డింగ్‌లు కట్టి సంబరాలు జరుపుకొన్నారు.

    అజ్ఞాతవాసి చిత్రంలోని పాటతో

    అజ్ఞాతవాసి చిత్రంలోని పాటతో

    అజ్ఞాతవాసి చిత్రంలోని మధురాపురి.. స్వాగతం క‌‌ృష్ణ అనే పాటను పెట్టి ఓ వీడియోను షూట్ చేశారు. అజ్ఞాతవాసి చిత్రాన్ని ఘన విజయం సాధించేలా చేద్దాం. తిరుగులేని విజయం సాధిస్తుంది అంటూ ఆనందంతో డ్యాన్సులు చేశారు.

     పవన్ రికార్డు బ్రేక్ చేయడం

    పవన్ రికార్డు బ్రేక్ చేయడం

    అజ్ఞాతవాసి సాధించే రికార్డులను, అధిగమించే మైలురాళ్లను తమతో షేర్ చేసుకోవాలని పవన్ కల్యాణ్ అభిమానులు లాస్ ఎంజెలెస్ ఫ్యాన్స్ కోరారు. అజ్ఞాతవాసి చిత్రంతో పవన్ అన్ని రికార్డులు తిరుగరాస్తారు. పవన్ చిత్రం భారీ విజయాన్ని సాధిస్తుంది అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

    వార్నర్ బ్రదర్స్ స్టూడియో వద్ద

    వార్నర్ బ్రదర్స్ స్టూడియో వద్ద అజ్ఞాతవాసి టీషర్టులు ధరించిన పవన్ కల్యాన్ అభిమానులు హల్‌చల్ చేశారు. హాలీవుడ్‌లో అజ్ఞాతవాసి రికార్డులు బ్రేక్ చేస్తే ఆ కిక్కే వేరబ్బా అంటూ తమ ఆనందాన్ని పంచకొన్నారు.

     యూఎస్‌లో జనవరి 9న రిలీజ్

    యూఎస్‌లో జనవరి 9న రిలీజ్

    ఫెంచ్ సినిమా లార్గో వించ్ అనే సినిమాను చూసి అజ్ఞాతవాసి కాపీ కొట్టారనే వివాదం నడుమ అజ్ఞాతవాసి చిత్రం జనవరి 9న అమెరికాలో, 10న ఇండియాలో ఈ చిత్రం రిలీజ్ అవుతున్నది.

    English summary
    Power star Pawan Kalyan has been in news ever since his Agnyaathavaasi was officially announced. It's no news that the actor-politician enjoys a huge fan following across the globe. With the movie release date round the corner, the PK fan frenzy has hit a fever's pitch. They have put up the movie hoardings and banners across Los Angeles. “Our Pawan will definitely break all the records making the movie a big hit here,” a fan said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X