సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’కి పవన్ కళ్యాణ్ ప్రశంసలు

Recommended Video

Pawan Kalyan Appreciated Sai Dharam Tej Acting In Chitralahari Movie || Filmibeat Telugu

సాయి ధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన మూవీ 'చిత్రలహరి'. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద తొలి రోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. వరుస ప్లాపుల తర్వాత ఎట్టకేలకు సాయి ధరమ్ తేజ్ ఖాతాలో హిట్టు పడింది.

మొత్తానికి తమ మేనల్లుడి కెరీర్ మళ్లీ గాడిలో పడటంతో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందంపై ప్రశంసలు గుప్పించారు. దర్శకుడు కిపోర్ తిరుమల చక్కటి మేసేజ్‌తో ఆద్యంతం చక్కగా సినిమాను నడిపించారని, సాయి తేజ్ పరిణితితో కూడిన నటనతో ఆకట్టుకొన్నాడంటూ పొగిడేశారు.

Power Star Pawan Kalyan appreciated Chitralahari

తాజాగా పవన్ కళ్యాణ్ చిత్ర బృందాన్ని విష్ చేస్తూ ఫ్లవర్ బొకేలు పంపారు. 'డియర్ సర్.. అభినందనలు, మీ వర్క్ నేను చాలా ఎంజాయ్ చేశాను' అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నట్లుగా ఆ ఫ్లవర్ బొకేలాపై రాసి ఉంది.

'చిత్రలహరి' మూవీ వసూళ్ల విషయానికొస్తే... ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 12.80 కోట్లకు అమ్మగా, ఫస్ట్ వీకెండ్ రూ. 9.35 కోట్ల షేర్ సాధించి అదరగొట్టింది. తొలివారం పూర్తయ్యే నాటికి ఈ మూవీ పూర్తి పెట్టుబడి రికవరీ కావడంతో పాటు లాభాల్లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

సాయిధ‌ర‌మ్‌తేజ్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్, నివేథా పేతురాజ్‌ హీరో హీరోయిన్స్‌గా న‌టించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X