BRO Pre Release: పవన్ భక్తులకు బ్యాడ్ న్యూస్.. బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పోలీసుల షాక్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం బ్రో. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ట్రైలర్ ఇటీవల రిలిజ్ అయి మిలియన్ వ్యూస్ దిశగా దూసుకెళ్తుంది. ఇదిలా ఉండగా.. ఈరోజు బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంటు నిర్వహిస్తున్నట్లు చెప్పారు మేకర్స్. అయితే ఈ ప్రీరిలీజ్ ఈవెంటు ఆలస్యం కానుందట. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
బ్రో వచ్చేది అప్పుడే: టాలీవుడ్ సినీ లవర్స్.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమాల్లో పవన్ కల్యాణ్ బ్రో ఒకటి. ఇక ఈ సినిమాను తమిళ నటుడు, దర్శకుడు సముద్ర ఖని డైరెక్ట్ చేయగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఇక ఈ సినిమాలో పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ప్రమోషన్స్: ఇక ఇప్పటికే రిలీజ్ అయినా పాటలు, టీజర్స్, ట్రైలర్స్.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. పవన్ ను మునుపెన్నడూ చూడని లుక్ లో చూస్తున్నామంటూ ఫ్యాన్స్ అయితే సంబురపడిపోతున్నారు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ చేస్తూ వస్తోంది. హీరో సాయి ధరమ్ తేజ్, ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ ఇంటర్య్వూలు ఇస్తూ ప్రచారం చేస్తున్నారు.

ఆలస్యం అయ్యేలా ఉందే: దిలా ఉంటే.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించనున్నట్లు మేకర్స్ తెలిపారు. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ మేనియాను చూసేందుకు రెడీగా ఉండండి.. అంటూ మేకర్స్ ఓ లుక్ కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో వర్షం, ట్రాఫిక్ కారణంగా ఈ ఈవెంటు ఆలస్యం అయ్యేట్టు ఉందని తెలిపారు మేకర్స్.

ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్: వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా గౌరవ పోలీసు శాఖ వారి సూచనల మేరకు అనుకున్న సమాయానికన్నా... వేడుక కొంత ఆలస్యంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఓ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. విచ్చేసే అభిమాన ప్రేక్షకులు దీనిని దృష్టిలో ఉంచుకుని ఇబ్బందులు పడకుండా టీవీ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వేడుకను వీక్షించ గలరు అని మనవి అంటూ విజ్ఞప్తి చేశారు. ఈ ఈవెంటు రాత్రి 8.30 గంటల నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

పవన్ వస్తాడా: దీనితో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఏంతో ఆశగా పవన్ కల్యాణ్ చూద్దామని అనుకున్న వారికి కాస్త ఇది చేదు వార్తే. పవన్ ను చూడాలని దూర ప్రాంతాల నుంచే వచ్చే వారు.. ఈ ట్రాఫిక్, వర్షం కారణంగా మరింత ఆలస్యం అవుతుంది. అసలు ఈ ఈవెంటుకు పవన్ వస్తాడో కూడా తెలియని పరిస్థితి. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











