Pawan Kalyan దిల్ రాజు కుటుంబానికి తీవ్ర విషాదం.. పవన్ కల్యాణ్ ఓదార్పు

తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర నిర్మాత దిల్ రాజు కుటుంబంలో విషాదం చోటుచేసుకొన్నది. ఆయన తండ్రి అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. దాంతో దిల్ రాజు సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు దిగ్బ్రాంతికి గురయ్యారు. తండ్రి మరణంతో పుట్టెడు దు:ఖంలో ఉన్న దిల్‌ రాజుకు పవన్ కల్యాణ్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. దిల్ రాజు తండ్రి మరణం, అంత్యక్రియలు, సినీ ప్రముఖుల సంతాపం వివరాల్లోకి వెళితే..

దిల్ రాజు తండ్రి పేరు శ్యాంసుందర్ రెడ్డి. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. కొద్దికాలంగా వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు. సోమవారం రాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పైకి తరలించారు. అయితే ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు, దిల్ రాజు తండ్రి అక్టోబర్ 9వ తేదీ రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మరణించారు అని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Shyam Sunder Reddy passed away in Hyderabad

తండ్రి మరణంతో దిల్ రాజు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తండ్రి మృతితో పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆయనను పలువురు ప్రముఖులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పరామర్శిస్తున్నారు. కొందరు ప్రముఖులు ఫోన్‌లో, మరికొందరు స్వయంగా వెళ్లి దిల్ రాజును ఓదార్చుతున్నారు. దిల్ రాజుకు మానసికంగా అండగా ఉంటూ పవన్ కల్యాణ్ సంతాప ప్రకటనను విడుదల చేశారు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి శ్రీ శ్యాంసుందర రెడ్డి గారి మరణం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. దిల్ రాజు, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. అలాగే దిల్ రాజు ఫ్యామిలీ మెంబర్స్‌కు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకొంటున్నాను అని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో తెలిపారు.

Power Star Pawan Kalyan condolenced Dil Raju on his father death

ఇదిలా ఉండగా, శ్యాంసుందర్ రెడ్డి భౌతికకాయాన్ని ఉదయం ఎమ్మెల్యే, ఎంపీ కాలనీలోని దిల్ రాజు నివాసానికి ఉదయం 6.30 గంటల ప్రాంతంలో తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఆ తర్వాత మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో జూబ్లీ హిల్స్‌లోని మహా ప్రస్థానం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు అని కుటుంబ సభ్యులు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X