Shah Rukh Khan షారుక్ కొడుకును డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తే.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మంగళగిరిలోని తన కార్యాలయంలో భావోద్వేగంగా మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ జనసేన పార్టీ పీఏసీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో ఏపీలో గంజాయి, డ్రగ్స్ దాందా గురించి మాట్లాడుతూ.. షారుక్ ఖాన్ కొడుకు అరెస్ట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఈ సమావేశంలో మాట్లాడుతూ..
షారుక్ ఖాన్ కొడుకు అరెస్ట్ గురించి:మైనారిటీల మద్దతు కోసం నేను మాట్లాడటం లేదు. షారుక్ ఖాన్ కొడుకును డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తే.. ఇదే వేదికపైన ఖండించాను. నేను ఆర్యన్ అరెస్ట్‌ను ఖండిస్తే.. మాదక ద్రవ్యాల కేసును ఎలా ఖండిస్తావు అని కొందరు ప్రశ్నించారు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకోలేదనే కటిక నిజం కళ్లముందు కనిపిస్తున్నప్పుడు.. ఖండించకుండా ఎలా ఉంటాను. తప్పు చేశాడా? లేదా అనే కోర్టులు నిర్ణయిస్తాయి. షారుక్ ఖాన్‌కు అండంగా నిలిస్తే బీజేపీ నాయకులు బాధపడుతారని నేను ఆలోచించాను. నేను ఎప్పుడూ నిజం మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను అని పవన్ కల్యాణ్ అన్నాడు.

35 గ్రాముల డ్రగ్స్ ఉంటే..:సత్యాన్ని, ధర్మాన్ని పరీరక్షించాలంటే..కులం, మతం గురించి ఆలోచించను. మైనారిటీల ఓటు గురించో, వారి మద్దతు సంపాదించడాని నేను మాట్లాడను. నాకు ఆ స్టాండ్ తీసుకొంటాను. 35 గ్రాముల డ్రగ్స్ ఉన్నట్టు, అతడి స్నేహితుల వద్ద ఉన్నదని అరెస్ట్ చేస్తే తప్పు. ఆర్యన్ ఖాన్‌ను ఉండే ప్రదేశంలో డ్రగ్స్ ఉన్నదనే ఒకే కారణంతో నెల రోజులు జైలుకు పంపించారు. దాని వల్ల ఇబ్బంది పండింది ఎవరు? అని పవన్ కల్యాణ్ అన్నారు.

ఏపీలో భారీగా గంజాయి:ఏపీలో ఎక్కడా లభించనంతగా గంజాయి పట్టుబడింది. దానికి గురించి మీడియా మాట్లాడదు. ఒక్క వార్త కూడా ప్రసారం చేయదు. షారుక్ కొడుకు ఆర్యన్ ఖాన్ స్నేహితుల వద్ద 35 గ్రాముల కొకైన్ లభించిందని, ఆ అబ్బాయికి సంబంధం లేకుండా జైలుకు పంపించారు. ఇలాంటి విషయాలు మాట్లాడితే అందరూ ఇబ్బంది పడుతారని తెలిసినా నేను మాట్లాడకుండా ఉండలేను. నేను ఎవరికీ భయపడకుండా నేను భవిష్యత్‌ను ఆలోచించి మాట్లాడుతాను అని పవన్ కల్యాణ్ చెప్పారు.

జగన్ లాంటి క్రిమినల్‌కు భయపడను:జగన్ ఓ క్రిమినల్.. సైకో. ఆయన్ను అలా అంటే నాపై కేసులు పెట్టిన నాకు భయం లేదు. ఇదే జగన్‌ను వరంగల్‌లో రాళ్లతో తరిమి కొట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా జగన్‌ను రాళ్లతో కొట్టే పరిస్థితి ఎంతో దూరం లేదు అని పవన్ కల్యాణ్ జోస్యం చెప్పారు. పులివెందుల లాంటి ప్రదేశంలో ఫ్యాక్షన్ వ్యవహారాలు చెల్లుతాయేమో. కానీ ఆంధ్రాలో మాత్రం ఫ్యాక్షన్ చెల్లుబాటు కాదు. ఇలాంటి సంస్కతికి మేము ప్రాణాలు అడ్డుపెట్టి ఆంధ్రాను కాపాడుకొంటాం అని పవన్ కల్యాణ్ అన్నారు.

ఏపీకి జగన్ హానికరం:జగన్ అనే వ్యక్తి ఆంధ్ర ప్రదేశ్‌కు హానికరం. నాలాంటి వ్యక్తిని రోడ్డుపై అడ్డుకొంటే చేసేది ఏమీ లేదు. రాష్ట్రంలో అమ్మాయిలు అదశ్యమైతే మాట్లాడడు. ఆయనను ఎవరూ కూడా ప్రశ్నిస్తే సహించరు. మన దేశంలో అందరికి పిరికితనం ఆవహించింది. ప్రశ్నిస్తే ఏం చేస్తాడు? జనం ఇంకోసారి వస్తే ఎక్కడికైనా పారిపోతాం అంటే సరికాదు. మనలో అనైక్యతను దూరం చేసి సఖ్యతగా ఉండాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.


Click it and Unblock the Notifications











