పవన్ కల్యాణ్‌కు అస్వస్థత.. జనసేన అధినేత ఆరోగ్యం ఎలా ఉందంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీ స్థాపించి ప్రజాసేవకు సిద్ధమైన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజుల నుంచి ఆయన వారాహి యాత్ర పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఒక షాక్ న్యూస్ అయితే బయటకు వచ్చేసింది. ప్రస్తుతానికి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనారోగ్యం బారిన పడినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

జనసేన పేరుతో పార్టీ: మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతి తక్కువ సమయంలోనే స్టార్ క్రేజ్ దక్కించుకున్నారు. తెలుగులో మరే హీరోకి దక్కని విధంగా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే దక్కింది. ముందుగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి యువరాజ్యం బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనమైన తర్వాత రాజకీయంగా స్తబ్దుగానే ఉండిపోయారు. 2014 ఎన్నికల ముందు జనసేన పేరుతో పార్టీ ఏర్పాటు చేసిన ఆయన తెలుగుదేశం పార్టీ బిజెపి కూటమికి మద్దతు ఇచ్చారు.

Pawan Kalyan

ఒకే స్థానానికి పరిమితం..:2019 ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వామపక్షాలు బీఎస్పీ వంటి పార్టీలతో కలిసి తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేసింది. అయితే అనూహ్యంగా జనసేన పెద్దగా సీట్లు దక్కించుకోలేకపోయింది. దాదాపుగా 175 స్థానాలలో జనసేన జనసేన బలపరిచిన అభ్యర్థులు పోటీ చేసిన కేవలం ఒకే స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. పవన్కళ్యాణ్ స్వయంగా రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. కానీ రెండు చోట్ల కూడా గెలవలేకపోయారు.

Pawan Kalyan

అనారోగ్యం బారిన పవన్:అయితే జగన్ పాలన బాగుంటే తను హ్యాపీగా సినిమాలు చేసుకుంటాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ అన్నట్టుగానే సినిమాలు చేయడం మొదలుపెట్టారు. అయితే జగన్ పాలన ఏమాత్రం బాలేదని చెబుతూ జనసేన పార్టీ వేదికగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన వరుసగా వారాహి యాత్ర పేరుతో గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

Pawan Kalyan

ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం: అవిశ్రాంతంగా వారాహి యాత్ర కొనసాగిస్తుండటంతో స్వల్పంగా అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ఇబ్బంది పడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పెద్దపురంలోని ఓ ఫంక్షన్ హాల్లో జనసేనాని విశ్రాంతి పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనతో ఈరోజు భీమవరం నేతల భేటీ అనారోగ్యం కారణంగా సాయంత్రానికి వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X