పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ విడుదల తేది ఖరారు...!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై హరీష్ శంకర్ దర్శకత్వంలో గణేష్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'గబ్బర్ సింగ్". సల్మాన్ ఖాన్ హీరోగా హిందీలో రూపొందిన సూపర్ హిట్ మూవీ 'దబాంగ్" రీమేక్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్" విడుదల తేదీ దాదాపు ఖరారైంది. ఈ సినిమా ఏప్రిల్ నెల 2012 లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ 'దబాంగ్" కు ఆఫీషియల్ రీమేక్. శ్రుతి హసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
చిత్రం గురించి దర్శకడు హరీష్ శంకర్ మాట్లాడుతూ 'సల్మాన్ ఖాన్ బాడీలాంగ్వేజ్ కి అనుగుణంగా రూపొందిన 'దబాంగ్" హిందీలో ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి కరెక్ట్ గా సూటయ్యే పాత్ర కావటం తో ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అంతే కాదు ఈ మూవీ ఎప్పుడు వస్తుందా అని పవన్ అభిమానులు చాల ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. పరమేశ్వరి ఆర్ట్స్ బ్యానర్ పై 'గబ్బర్ సింగ్" సినిమా రూపొందుతుంది. ఇదిలావుంటే, పవన్ కళ్యాణ్ మరో చిత్రం 'పంజా" ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల 19 వ తేదీన జరుగనుంది.


Click it and Unblock the Notifications











