Pawan Kalyan: తలపతి విజయ్ ఫ్యాన్స్ కంటే పవన్ ఫ్యాన్స్ మరీ ఇంత వీకా ?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్... ఓవైపు రాజకీయాల్లో బిజి బిజిగా గడుపుతూ.. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉండగా.. తన మేనల్లుడుతో కలిసి నటించిన బ్రో సినిమా రిలీజుకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే ఆయన ఈ రోజు ఉదయం ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల దళపతి విజయ్ కూడా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశాడు. వీరు ఇద్దరికీ 1 మిలియన్ చేరుకోవడానికి ఎంత సమయం పట్టిందో ఓ సారి చూద్దాం.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఆయనకు యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఓవైపు ఏపీ ఎన్నికల సభలు, యాత్రల్లో పాల్గొంటునే.. మరోవైపు సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఇక ఆయన తన మేనల్లుడితో కలిసి నటించిన బ్రో చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలకు, నెటిజన్స్ కు దగ్గరయ్యేందుకు ఇన్ స్టాగ్రామ్ లో అకౌంట్ తెరిచారు. తెరిచిన గంటల్లోనే లక్షల ఫాలోవర్స్ వచ్చారు.

పవన్ కల్యాణ్.. అన్నయ్య నాగాబాబు ఇటీవల హి ఈజ్ కమింగ్ టు బ్లాస్ట్ అనే క్యాప్షన్ తో పోస్ట్ చేశారు. ఇక తాజాగా పవన్ కల్యాణ్ ఇన్ స్టా అకౌంట్ ఓపెన్ అయింది. ఇప్పటివరకు ఒక్క పోస్ట్ పెట్టని ఈ అకౌంట్ బయోలో ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో జై హింద్ అని రాసుకొచ్చారు. అయితే తాజాగా పవన్ ఓ సంచలన రికార్డు సృష్టించారని తెలుస్తోది. అకౌంట్ క్రియేట్ చేసిన 8 గంటల్లోనే 10 లక్షల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. దీంతో ఒక్క పోస్ట్ కూడా చేయకుండానే అత్యధిక ఇన్ స్టా ఫాలోవర్లను పొందిన ఏకైక టాలీవుడ్ నటుడిగా పవర్ స్టార్ చరిత్ర సృష్టించారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల దళపతి విజయ్ కూడా ఇన్ స్టాగ్రామ్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఆయన లియో సినిమాకు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేసి... అకౌంట్ ఓపెన్ చేశాడు. ఇక విజయ్ ఇలా అకౌంట్ ఓపెన్ చేశారో లేదో అప్పుడు మిలియన్ ఫాలోవర్స్ వచ్చేశారు. ఒక గంటలోనే 1.1 మిలియన్ మంది విజయ్ ను ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం విజయ్ ఫాలోవర్స్ 8 మిలియన్స్ గా ఉన్నారు.

అయితే తమిళ హీరో విజయ్, పవన్ ను కంపైర్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్స్. విజయ్ 99 నిమిషాల్లోనే 1.1 మిలియన్ సాధిస్తే.. పవన్ కు మాత్రం 6 గంటలు పట్టిందని చెబుతున్నారు. ఇక పవన్ కల్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో... తమిళనాడులో దళపతి విజయ్ కు అంతే క్రేజ్ ఉంది. ఒక్క తమిళనాడు మాత్రమే కాదు.. ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టార్. అందుకే ఆయనకు అంత మంది ఫాలోవర్స్ వచ్చారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక Kim Tae-hyung (53 నిమిషాలు), ఏంజెలీనా జోలీ (59 నిమిషాలు) తర్వాత 1 మిలియన్ ఫాలోవర్లను చాలా వేగంగా మూడవ ఫాస్టెస్ట్ ఫాలోవర్స్ సంపాదించిన అకౌంట్ గా విజయ్ ది నిలిచింది. అయితే విజయ్ అకౌంట్ ఓపెన్ చేసిన రోజు ఒక ఫోటో పోస్ట్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఎలాంటి పోస్టు చేయకుండానే మిలియన్ ఫాలోవర్స్ ను సాధించారు. ఇక 24 గంటల్లో పవన్ కు ఏ రేంజులో రానున్నాయో చూడాలి. ఇది కదా పవన్ కల్యాణ్ పవర్ అంటున్నారు.


Click it and Unblock the Notifications











